Viral: మ్యాట్రిమోనిల్ సైట్ ద్వారా మ్యాచ్! వరుడి జీతంలో ఒక సున్నా తగ్గిందని..
ABN, Publish Date - Oct 29 , 2024 | 02:25 PM
మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన కెదురైన అనుభవాన్ని వివరిస్తూ పురుష హక్కుల కార్యకర్త ఒకరు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మ్యాట్రిమోనియల్ సైట్‌లో తనకెదురైన అనుభవాన్ని వివరిస్తూ పురుష హక్కుల కార్యకర్త ఒకరు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. kish Siff పేరిట ఉన్న అకౌంట్లో అతడీ ఉదంతాన్ని పంచుకున్నాడు.
ఫురుషల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఎన్జీఓలో తాను పనిచేస్తున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఇటీవల మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ మహిళ సంబంధం వచ్చినట్టు చెప్పాడు. తన ప్రొఫైల్‌లో జీతం రూ.30 లక్షలని తప్పుగా రాసున్నట్టు చెప్పాడు. అయితే, చివరి నిమిషంలో అక్షరదోషాన్ని గుర్తించి వెల్లడించినందుకు రసాభాస జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాడు (Viral).
Viral: భారతీయ రైల్లోని మురికి వాష్‌రూం వీడియోను షేర్ చేసిన ఫారినర్!
మొదట్లో తమ మధ్య అంతా బాగానే ఉందన్నాడు. వధువుకు ఇది రెండో వివాహమని చెప్పుకొచ్చాడు. వాళ్లు త్వరగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలని పట్టుబట్టినట్టు తెలిపాడు. తాను కొంత సమయం కోరితే మరో సంబంధం చూసుకుంటామని వారు చెప్పినట్టు తెలిపాడు. ఇది ఇద్దరికీ రెండో వివాహం కావడంతో వీలైనంత త్వరగా పెళ్లి జరగాలని వారు కోరినట్టు వివరించాడు. దీంతో, నవంబర్ 15-20 మధ్య ఎంగేజ్‌మెంట్‌కు తాను ఓకే చెప్పానని తెలిపాడు. ఈ క్రమంలో తన వార్షిక జీతం రూ.3 లక్షలకు బదులు రూ.30 లక్షలుగా ఉన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళితే వధువు తల్లి ఇంతెత్తున ఎగిరి పడిందని తెలిపారు. ఆ తరువాత ఆమె నోరుపారేసుకున్న తీరుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.
Indian Railway Coaches: భారతీయ రైళ్లల్లో ఎరుపు, నీలం బోగీల మధ్య తేడా తెలుసా?
తన మాజీ భర్త నుంచి ఆమెకు భారీగా భరణం వస్తున్న విషయాన్ని వారు దాచిపెట్టారని తెలిపారు. తన మాజీ అత్తమామల మీద పెట్టిన తప్పుడు సెక్షన్ 498ఏ కేసును ఉపసంహరించుకునేందుకు రూ.80 లక్షలు పుచ్చుకున్నారని, కానీ తన వద్ద అసలు విషయం దాచిపెట్టి ఏవో కట్టుకథలు వినిపించారన్నాడు. తన జీతం గురించి చెప్పాక వధువు తల్లి తనను మరీ దారుణంగా దుర్భాషలాడిందని కూడా చెప్పారు.
ఈ ఉదంతం సహజంగానే నెట్టింట వైరల్‌గా మారింది. ఇలాంటి సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని కూడా హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతంపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.
Updated Date - Oct 29 , 2024 | 02:31 PM