ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai: అరకిలో బంగారం రూ.27 లక్షలంటే ఆశపడ్డ మహిళ.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..

ABN, Publish Date - Jun 01 , 2024 | 03:06 PM

తక్కువ ధరకు అరకిలో బంగారం వస్తోందంటే ఆశపడ్డ మహిళ బ్యాగ్ లో డబ్బుపెట్టుకుని కారులో బయలుదేరింది. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చిన నిందితులు డబ్బుతో సహా పరారయ్యారు. ముంబైలో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, లేదా రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిపేటప్పుడు చాలా ఎలర్ట్ గా ఉండాలి. చిన్న పొరపాటు కూడా లక్షల్లో నష్టం కలగజేయచ్చు. చివరకు ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. అయితే, ముంబైకి చెందిన ఓ మహిళ ఇవేమీ ఆలోచించలేదు. మార్కెట్ రేటుకంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఎవరో అంటే గుడ్డిగా నమ్మేసింది. బ్యాగులో నగదుకు తీసుకుని అపరిచితులతో కలిసి కారెక్కింది. చివరకు ఆమెకు ఊహించని షాక్ తగలడంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా (Trending) మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల బాధితురాలిని ఓ వ్యక్తి ఫోన్ లో సంప్రదించాడు. మార్కట్ ధర కంటే చీప్ రేట్ లో బంగారం ఇపిస్తానన్నాడు. అరకిలో బంగారం రూ. 27 లక్షల ధర చెప్పగానే ఆమె సంబరపడిపోయింది. చీప్ రేట్ లో బంగారం వస్తుంటే ఎందుకు కాదనుకోవాలని భావించింది. ముందూ వెనకా ఆలోచించకుండా మోసగాళ్ల పన్నిన వలలో చిక్కింది (Woman loses Rs 28 lakh after accused promised gold at cheap rate).

Viral: వరుసగా 3 సార్లు భారతీయుడికి గిన్నిస్ రికార్డు! ఇతడేం చేశాడంటే..


ఇటీవల ఆమె బంగారం కొనేందుకు బ్యాగులో సుమారు రూ.27 లక్షలు తీసుకుని నిందితుడితో కలిసి కారెక్కింది. అతడు బాధితురాలిని సన్‌పాదా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్న మరికొందరు ఆమెను బెదిరించారు. ఆమె చేతిలోని బ్యాగ్ ను బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో ఆమె వెంట వెళ్లిన వ్యక్తి కూడా పారిపోయాడు. దీంతో, తిక్కుతోచని స్థితిలో పడిపోయిన మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడు రాకేశ్ శివాజీ షింగ్టే (39) తో పాటు రూపేఖ్ సుభాశ్ సప్కలే లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 03:13 PM

Advertising
Advertising