Viral: లైఫ్‌లో ఎన్నడూ సిగరెట్ తాగని మహిళకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూస్తే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 08:28 PM
ఆమె జీవితంలో ఎన్నడూ సిగరెట్ తాగి ఎరుగదు. అసలు ఆమెకు ధూమపానం అలవాటే లేదు. అలాంటి మహిళపై అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. సిగరెట్ తాగి దాన్ని నేలమీద పడేసి చెత్త చేసినందుకు జరిమానా కట్టాలంటూ నోటీసులు పంపించారు. బ్రిటన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె జీవితంలో ఎన్నడూ సిగరెట్ తాగి ఎరుగదు. అసలు ఆమెకు ధూమపానం అలవాటే లేదు. అలాంటి మహిళపై అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. సిగరెట్ తాగి దాన్ని నేలమీద పడేసి చెత్త చేసినందుకు జరిమానా కట్టాలంటూ నోటీసులు పంపించారు. జరిమానా కట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తన తప్పు లేదని నిరూపించుకునేందుకు ఆమె తీవ్రంగా శ్రమ పడి విజయం సాధించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ వింత ఘటన నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: జర్మనీలో ఇంజినీర్‌గా చేసి యాచకుడిగా మారిన వ్యక్తి! ఇతడి అసలు కథ ఇదా!
ఈ వింత పరిస్థితిని ఎదుర్కొన్న మహిళ పేరు నాటలీ వాల్టన్. ఆమె ఇంటికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ నాటలీ ఇష్టారాజ్యంగా నేలపై సిగరెట్లు పడేసి చెత్త చేశారని స్థానిక అధికారులు ఆరోపించారు. ఆమెకు నోటీసులు కూడా పంపించారు. చేసిన తప్పుకు జరిమానాగా రూ.8 వేలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. విషయం కోర్టు దాకా వెళితే జరిమానా రూ.2.69 లక్షలకు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు.
కానీ, నాటలీ మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చింది. తన వివరాలతో ఎవరో ఇలా మోసానికి పాల్పడ్డారని చెప్పింది. ‘‘నేను అసలు ఆ గ్రామానికి వెళ్లి దశాబ్దాలు గడిచిపోయాయి. నేను చేయని తప్పునకు వారు జరిమానా కట్టమంటున్నారు. ఇది చాలా వింతగా ఉంది. అసలు నాకు పొగతాగే అలవాటే లేదు’’ అని ఆమె మీడియాకు చెప్పింది.
Viral: తల్లిదండ్రుల చిన్న పొరపాటు.. 20 ఏళ్ల పాటు యువకుడికి నరకం!
దీని వెనకాల ఏదో మోసం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తన వివరాలను తస్కరించి చేయని తప్పుకు బాధ్యులను చేసే ప్రయత్నం జరిగిందని చెప్పింది. తన వాదనలకు మద్దతుగా పలు ఆధారాలను కూడా సమర్పించింది. ఘటన జరిగిన సందర్భంలో తాను మరో ప్రాంతంలో షాపింగ్ చేస్తున్నట్టు చెప్పిన ఆమె ఇందుకు సంబంధించి క్రెడిట్ కార్డు చెల్లింపుల వివరాలను సమర్పించింది. దీంతో, వెనకడుగు వేసిన అధికారులు ఆమె తాజా ఫొటోలు పంపమని కూడా కోరారు. వాటిని పరిశీలించాక అధికారులకు అసలు నిందితురాలు నాటలీ కాదని అర్ధమైంది. ఘటనాస్థలంలోని సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాల్లోని వ్యక్తికి నాటలీకి పోలీకే లేకపోవడంతో అధికారులు నాటలీని నిర్దోషిగా పేర్కొన్నారు. అయితే, అసలు తప్పు చేసిన వ్యక్తి జాడ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో, ఆ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ఇతర మార్గాల్లో ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
Updated Date - Dec 01 , 2024 | 08:35 PM