ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral:17 ఏళ్లకే చదువుకు గుడ్‌బై చెప్పి యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టిన యువతి! ఇప్పుడెలా ఉందో తెలిస్తే..

ABN, Publish Date - Aug 29 , 2024 | 01:06 PM

17 ఏళ్ల వయసులో చదువుకు ఫుల్‌‌‌స్టాప్‌ పెట్టి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఓ యువతి అసాధారణ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. ‌‌‌‌‌‌‌‌‌‌

ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు. చాలా మంది తొలుత యూట్యూబ్ ఛానల్‌ను ఓ వ్యాపకంగా ప్రారంభించి ఆ తరువాత విజయాలు రావడంతో పూర్తిస్థాయి కంటెంట్ క్రియేటర్లుగా మారిపోయారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి ఇందుకు భిన్నం. 17 ఏళ్ల వయసులోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి యూట్యూబ్ వైపు మళ్లిన ఆమె ప్రస్తుతం నెట్టింట గొప్ప పాప్యులారిటీ సొంతం చేసుకుంది (Viral).


యూట్యూబ్ ఛానల్‌తో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ యువతి పేరు సుబా సరాఫ్. ఆమె యూట్యూబ్ ఛానల్ పేరు satvikmovement. 17 ఏళ్ల వయసులో ఆమె చదువుకు గుడ్‌బై చెప్పింది. సాత్విక జీవనంపై ఆమెకు ఎంతో ఆసక్తి. ఈ జీవిన విధానం గురించి దేశవిదేశీ గురువుల నుంచి ఎంతో నేర్చుకున్న ఆమె చివరకు ఈ విషయాలను యూట్యూబ్‌లో పంచుకోవడం ప్రారంభించింది. అయితే, 2019లో కోవిడ్ సందర్భంగా ఆమె యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏకంగా 7 మిలియన్లు దాటింది. ఈ పాప్యులారిటీ ఆధారంగా ఆమె ఆఫ్‌లైన్ తరగతులు కూడా చేపట్టడం ప్రారంభించింది. ఈ ప్రయాణంలోనే తనకు తారసపడ్డ హర్షవర్ధన్‌ను ఆమె వివాహమాడింది (Woman Opts Out Of College To Focus On YouTube Her Channel Has 7 Million Followers).


ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో సాత్విక జీవనానికి సంబంధించి పలు వీడియోలకు 35 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండటం. చక్కెర తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వంటి సూచనలతో ఆమె మంచి పాప్యులారిటీ సాధించింది. భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం సాత్విక జీవన విధానానికి ప్రచారం కల్పిస్తున్నారు.

అయితే, సుబా సరాఫ్ చేసిన కొన్ని సూచనలు మాత్రం విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా కొబ్బరి, కొబ్బరి పాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమె సూచిస్తున్న ఆహారంతో శరీరానికి తగినన్ని మాంసకృత్తులు లభిస్తాయా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఈ డైట్‌తో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని కూడా అన్నారు. విమర్శల మాట ఎలా ఉన్నా, ఆమె యూట్యూబ్ ఛానల్‌ సబ్‌‌స్క్రైబర్ల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది.

Read Viral and Telugu News

Updated Date - Aug 29 , 2024 | 01:16 PM

Advertising
Advertising