ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వామ్మో.. ఇలాంటి ఆటో ఎక్కడా చూడలేదే? మహిళకు ఆశ్చర్యం!

ABN, Publish Date - Sep 01 , 2024 | 01:00 PM

ఆటోలోకి వర్షం రాకుండా ఓ కిటికీ ఏర్పాటు చేసిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ప్రయాణికురాలు నెట్టింట పంచుకున్న ఈ ఉదంతం జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్య తరగతి వ్యక్తులకు అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం ఆటో. ఇక ప్యాసెంజర్లను ఆకట్టుకునేందుకు కొందరు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను రకరకాలుగా డెకరేట్ చేస్తుంటారు. వివిధ రంగుల రిబ్బన్లు, ఆకర్షణీయమైన క్యాప్షన్లను రాస్తుంటారు. అయితే, వానాకాలం మాత్రం ఆటోలతో ఇబ్బంది తప్పదు. ఆటోలోపలికి వాన వచ్చి తడిసిపోవడం ఆటో ప్రయాణికులకు అనుభవమే. అయితే, తాజాగా ఓ మహిళ తనెక్కిన ఆటోలో ఏర్పాట్లు చూసి అవాక్కయ్యింది. అంతేకాకుండా, ఈ విషయాలను నెట్టి్ంట పంచుకోవడంతో ఈ ఉదంతం వైరల్‌గా (Viral) మారింది.

USA: దారుణం.. పెంపుడు కుక్కను ఉసిగొల్పి మాజీ బాయ్‌ఫ్రెండ్ కూతురి హత్య!


మహిళ ఎక్కిన ఆటోలో ఓ వైపు కిటికీని ఏర్పాటు చేశారు. అచ్చం ఇళ్లల్లో ఉండే మోడల్‌ కిటికీని ఏర్పాటు చేశారు. స్లైడింగ్ అద్దాలు ఉన్న ఈ కిటికీ మినహా మిగతా ప్రాంతమంతా మూసేసి ఉంది. ఇది మహిళను అమితంగా ఆకర్షించింది. ఇక డ్రైవర్ సీటు వైపు నుంచి ప్రయాణికుల మీదకు వర్షం రాకుండా కూడా అందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఫొటోను నెట్టింట పంచుకున్న మహిళ తాను ఇలాంటి ఆటోను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేసింది.


మరోవైపు జనాలు కూడా ఈ ఆటో చూసి షాకైపోతున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఓనర్ తన ఆటోకు చేసిన ఏర్పాటు చూసి ప్రశంసిస్తున్నారు. ఈ ఆటో ఎక్కడిదని కొందరు ప్రశ్నించగా బెంగళూరులోనిదని మహిళ జవాబిచ్చింది. అయితే, కిటికీపై మాత్రం రకరకాల కామెంట్స్ వచ్చాయి. అంత చిన్నగా ఉన్న కిటికీ చూస్తుంటే ముంబైలోని అపార్ట్‌మెంట్లు గుర్తొస్తున్నాయని కొందరు అన్నారు. మరికొందరేమో, అవి బెంగళూరు ఫ్లాట్లల్లోని కిటికీ ల్లాగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇది ఆటో కాదు పుష్పక విమానం.. ఇంత గొప్ప వాహనాన్ని తాను ఎక్కడా చూడలేదు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

Read Latest and Viral News

Updated Date - Sep 01 , 2024 | 01:12 PM

Advertising
Advertising