ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో! ఈమేంటీ.. సిగరెట్ అడిగితే ఇవ్వలేదనే కోపంతో.. చివరకు మరీ ఇలా చేసిందేంటీ..

ABN, Publish Date - Feb 18 , 2024 | 08:37 PM

చిన్న చిన్న సమస్యలకు కొందరు పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇంకొందరు ఎదుటి వారిపై దాడులకు పాల్పడి మరీ తమ ప్రతీకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

చిన్న చిన్న సమస్యలకు కొందరు పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇంకొందరు ఎదుటి వారిపై దాడులకు పాల్పడి మరీ తమ ప్రతీకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి సిగరెట్ అడిగితే ఇవ్వలేదనే కోపంతో చివరకు దారుణానికి పాల్పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారుకు బంక్‌లో పెట్రోల్ పట్టుకుంటుంటాడు. ఇంతలో ఓ యువతి (young woman) అక్కడికి వస్తుంది. అతన్ని పిలిచి తనకు ఓ సిగరెట్ ఇవ్వాలని అడుగుతుంది. తన వద్ద ఎలాంటి సిగరెట్లూ లేవని అతను సమాధానం ఇస్తాడు. దీంతో యువతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని అడుగులు వెనక్కు వేసి, మళ్లీ కారు వద్దకు వెళ్తుంది. జేబులో నుంచి లైటర్ (young woman lit fire to car with lighter) బయటకు తీసి, పెట్రోల్ వద్ద అంటిస్తుంది.

Viral Video: ఇవెక్కడి తెలివితేటలురా బాబూ..! అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపించినా.. డబ్బులు ఎలా తీసుకున్నారో చూడండి..

స్పార్క్ బయటకు రాగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తాయి. ఊహించని ఘటనకు షాకైన వ్యక్తి.. పెట్రోల్ పైపును బయటకు తీస్తాడు. అప్పటికే మంటలు ఎగిసిపడడంతో చేసేదేమీ లేక.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తాడు. ఈ ప్రమాదంలో కారుతో పాటూ మిగతా వస్తువులు కూడా తీవ్రంగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈమేంటీ మరీ శాడిస్టులా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సిగరెట్ అడగడమే తప్పు అయితే.. మరీ నిప్పు పెట్టడం ఏంటీ’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పారాచ్యూట్ లేకుండానే కిందకు దూకేసిన వ్యక్తి.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

Updated Date - Feb 18 , 2024 | 08:37 PM

Advertising
Advertising