ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నదిలో స్నానానికి వెళ్తున్నారా.. ఈమెలా చేస్తే మీ జుట్టు మటాష్

ABN, Publish Date - Nov 08 , 2024 | 06:16 PM

మన దేశంలో నదుల్ని ఎంత పవిత్రంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నదీ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనేది చాలా మందికి ఉన్న నమ్మకం. ఆ అవకాశం వస్తే అస్సలు వదలరు. కనీసం మూడు మునకలైనా వేస్తారు.

Viral Video: మన దేశంలో నదుల్ని ఎంత పవిత్రంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నదీ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనేది చాలా మందికి ఉన్న నమ్మకం. ఆ అవకాశం వస్తే అస్సలు వదలరు. కనీసం మూడు మునకలైనా వేస్తారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు నదీస్నానానికి బయల్దేరారు. కానీ అందులోని ఓ మహిళ చేసిన పనికి అక్కడ ఉన్నవారితో పాటు అందరూ అవాక్కయ్యారు. ఇలా కూడా స్నానం చేస్తారా అంటూ షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె ఏం చేసింది? అనేది ఇప్పుడు చూద్దాం..


ఇదేం స్నానం సామి

మన దేశంలోని నదుల్లో యమున ఒకటి. ఎంతో పురాతనమైన ఈ నదికి ఘనచరిత్ర ఉంది. అలాంటి నదిలో మునకేసి పుణ్యం దక్కించుకుందామని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అలాగే కొందరు మహిళలు యమునలో స్నానానికి దిగారు. అందులోని ఒకావిడ తలస్నానం చేయాలని చూసింది. అయితే సాధారణంగా అందరూ షాంపూతో తలస్నానం చేస్తారు. కానీ ఆమె మాత్రం ఆ నదిలోని నురుగుతో హెడ్ బాత్ చేసింది. ఆ నురుగును షాంపూ అనుకొని పొరబడిందేమే ఏమో.. దాన్ని బకెట్‌లో పోసుకొని మరీ స్నానం చేసింది. మహిళ నురుగుతో తలస్నానం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆమెలా చేస్తే మీ జుట్టు మటాష్ అవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అది షాంపూ కాదు.. నురుగు అని ఎవరైనా ఆమెకు చెప్పండి అంటూ జోకులు పేలుస్తున్నారు.


కాలుష్య కాసారాలుగా..

మన దేశంలో నదుల్ని ఎంత పవిత్రంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నదుల చుట్టూనే నాగరికత ఏర్పడింది. సాగు నీరుతో పాటు తాగునీరు కూడా నదుల నుంచే తీసుకుంటున్నాం. మనిషి మనుగడకు నదులు ఎంతో కీలకంగా మారాయి. అందుకే నదులను తల్లి మాదిరిగా ప్రేమగా, అప్యాయంగా చూసుకోవడం మన సంస్కృతిలో ఉంది. అవసరాలకు తగ్గట్లుగా ఆ నీళ్లను వాడుకున్నా.. దాని పరిరక్షణ కోసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, రసాయనాలన్నీ నదుల్లోనే కలిపేస్తున్నారు. దీంతో అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. వాటిల్లో స్నానం చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. అలాంటిది నదిలో స్నానానికి దిగిన మహిళ అందులోని నురుగుతో తలస్నానం చేయడం వైరల్‌గా మారింది.


Also Read:

ఈ అవ్వకు వయసు కేవలం అంకె మాత్రమే.. పటాకులు ఎలా పేలుస్తుందో చూస్తే..

పట్టాలు దాటుతున్న వృద్ధుడు.. దూసుకొచ్చిన వందేభారత్.. క్షణాల వ్యవధిలో..

ప్రపంచంలో అత్యంత ఎత్తైన వింత భవనం ఇదే.. దీన్ని చూశారంటే మతి పోవాల్సిందే..

For More Viral And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 06:24 PM