ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇలాంటి కోడలు దొరకాలంటే పెట్టిపుట్టాలి.. ఈ వృద్ధ జంట నిజంగా లక్కీ!

ABN, Publish Date - Oct 15 , 2024 | 05:14 PM

భర్త పోయిన తరువాత కూడా అత్తమామలతో కలిసుంటున్న ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది. తన నిర్ణయం వెనక కారణాలను వివరిస్తూ ఆమె నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన వెంటనే వేరు కాపురం పెట్టాలని కోరుకునే వాళ్లు కొకొల్లలు. కానీ ఓ మహిళ మాత్రం భర్త పోయినా కూడా అత్తమామల దగ్గరే ఉంటోంది. ఇలా ఉంటున్నందుకు తనను అందరూ వింతగా చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, తన నిర్ణయానికి గల కారణాలను కళ్లకుకట్టినట్టు చూపిస్తూ ఆమె నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి కోడలు దొరకాలంటే పెట్టిపుట్టాలంటూ జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు (Viral).

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!


‘‘భర్త పోయినా అత్తమామల వద్దే ఎందుకుంటున్నానంటే..’’ అనే క్యాప్షన్‌తో ఇషూ అనే మహిళ ఈ వీడియో పోస్టు చేసింది. ఇందులో ఆమె తన అత్తమామలకు కోడలిగా కంటే కూతురుగా మారిపోయినట్టు కనిపించింది. ఆ వృద్ధ జంట కోడలితో కలిసి మెలిసి మెలిగారు. అందరూ కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లారు. మనవడిని చూస్తూ ఆ వృద్ధ దంపతులు కొడుకు లేని లోటును మర్చిపోయారు. కుటుంబమంతా ఉల్లాసంగా కనిపించింది. కోడలిపట్ల వారికి ఉన్న అపార గౌరవాభిమానాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇలా అత్తమామలతో కలిసి ఉండటానికి గల కారణాలను ఇషూ కేవలం వీడియోతో కళాత్మకంగా వివరించింది.


NRI: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అవమానం! జాతీయపతాకాన్ని రూపొందించమని అడగడంతో..

‘‘నేను ఇంకా అత్తమామలతో ఎందుకు కలిసున్నానో అర్థం కాక చాలా మంది ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తుంటారు. ఇది మన సమాజంలో చాలా మందికి అర్థం కాని విషయం. జీవిత భాగస్వామి ఉన్నంతవరకే అత్తమామలతో సంబంధం అని అంటుంటారు. కానీ నా విషయంలో ఇలా జరగనందుకు నేను చాలా అదృష్టవంతురాలినని అనుకుంటున్నా. వారితో కలిసుండటం భగవంతుడిచ్చిన వరం’’ అని ఆమె చెప్పుకొచ్చింది.


Viral: నన్ను భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ వింత కండీషన్

అత్తమామలు, కోడలి మధ్య ఉన్న ఆప్యాయతానురాగాలు అనేక మందికి నచ్చాయి. దీంతో, జనాలు ఆ కుటుంబాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇలాంటి అత్తమమాలు దొరకడం మహిళ అదృష్టం అని కొందరు అన్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే అంతకుమించినది లేదని మరికొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం వృద్ధజంట లక్కీ అని, ఇలాంటి కోడళ్లు ఉండటం చాలా అరుదని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..

Read Latest and Viral News

Updated Date - Oct 15 , 2024 | 05:20 PM