Viral News: బేబిని తీసుకొని పరుగుతీసిన తల్లి
ABN, Publish Date - Sep 12 , 2024 | 09:21 PM
హఠాత్తుగా పాము కనిపిస్తే.. ఎగిరి గంతేస్తాం. అదే కొండ చిలువ అయితే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ సమయంలో పిల్లలు ఉంటే పరిస్థితి చెప్పలేం. కానీ ఓ తల్లి తెగించింది.
హఠాత్తుగా పాము కనిపిస్తే.. ఎగిరి గంతేస్తాం. అదే కొండ చిలువ అయితే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ సమయంలో పిల్లలు ఉంటే పరిస్థితి చెప్పలేం. కానీ ఓ తల్లి తెగించింది. కొండ చిలువ ఆ చిన్నారికి మీదకి వచ్చే ప్రయత్నం చేసింది. వెంటనే బేబిని తీసుకొని పరుగుతీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఊయాలలో చిన్నారి
చిన్నారిని పడుకోబెట్టుకొని ఊయాలలో ఓ తల్లి ఉంది. చిన్నారిని పడుకోబెట్టి మెల్లిగా కిందకి దిగింది. సందేహాం వచ్చి చూసే సరికి కొండ చిలువ ఉంది. పక్క నుంచి వెళుతుందిలే అనుకుంది. బేబి పడుకుంది.. ఎందుకు లేపడం అని అనుకుంది. ఆ కొండ చిలువ ఊయల పైకి లేచింది. లాభం లేదు అనుకొని చిన్నారిని ఎత్తుకొని వెళ్లింది. ఆ గది నుంచి బయటకు పరుగు తీసింది. వీడియోను ఇన్ స్టలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియోకు ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చింది. వేలాది మంది లైక్ చేశారు.
చిన్నారి వైపు ఫోకస్
ఆ సమయంలో తల్లి చిన్నారిని గమనించింది. కొండ చిలువను అస్సలు చూడలేదని ఒకరు రాసుకొచ్చారు. ఆ సమయంలో దేవుడు తల్లి వైపు అండగా నిలబడ్డాడని మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఆస్ట్రేలియాలో ఎక్కువగా జరుగుతాయని, అక్కడే కొండచిలువలు, పాములు కనిపిస్తాయని మరో యూజర్ రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు.
Updated Date - Sep 12 , 2024 | 09:21 PM