ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పాపులర్ ఇన్‌ఫ్లుయెన్స్‌ర్‌కు యువతి షాక్! ఫోటో దిగుదామని చెప్పి..

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:53 PM

ఢిల్లీలో ఓ ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు యువతి షాకిచ్చింది. మీరంటే ఎంతో అభిమానం.. మీతో ఓ ఫొటో దిగుతానంటూ వచ్చిన ఆమె అతడి వద్ద ఉన్న 100 గ్రాముల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లిపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ఓ ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు యువతి షాకిచ్చింది. మీరంటే ఎంతో అభిమానం.. మీతో ఓ ఫొటో దిగుతానంటూ వచ్చిన ఆమె అతడి వద్ద ఉన్న 100 గ్రాముల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లిపోయింది. అయితే, పోలీసులు వెంటనే రంగంలోకి దిగడంతో అతడి సొత్తు తిరిగి అతడికి దక్కింది (Viral).

Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..


సెప్టెంబర్ 18న ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో ఏదో ఫొటోషూట్ చేస్తున్న సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆమె సమీపించింది. అతడంటే అభిమానమని చెప్పింది. ఒక ఫొటో దిగుదామని ప్రతిపాదించింది. అతడి వద్ద ఉన్న గోల్డ్ చైన్ ఇతర ఆభరణాలు ధరించి ఫొటో దిగాలని చెప్పింది. యువతి పొగడతంతో కాదనలేక ఫొటోకు అతడు సిద్ధమయ్యాడు. ఇంతలో ఫోన్ రావడంతో అతడు అవతలి వారితో మాట్లాడుతూ ఉండగా ఆమె అతడి నగలు తీసుకుని పారిపోయింది. లక్షల రూపాయలు విలువైన 100 గ్రాముల బంగారు నగలతో ఉడాయించింది. ఆ తరువాత భర్తతో పాటు హర్యానాలోని తన ఇంటికెళ్లి అక్కడ నగలను జాగ్రత్తగా దాచి పెట్టింది. ఆ తరువాత పోలీసులకు అనుమానం రాకుండా మనాలీకి పారిపోయింది.

Viral: జొమాటో, స్విగ్గీల్లో త్వరగా డెలివరీలు రావాలంటే ఇలా చేయండి: నెటిజన్


యువతి చోరీ చేసిన తీరును చూసి షాకైపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా యువతి జాడ కనుక్కున్నారు. చివరకు ఆమెను మనాలీలో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆమె ఉద్దేశం చోరీ కాదని పోలీసులు తెలిపారు. యువతికి అప్పటికే వివాహం అయ్యిందని కానీ, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయితే, సదరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఫాలోవర్లకు సాయపడుతూ ఉంటాడని తెలిసి అక్కడికి వచ్చామని, కానీ అన్ని నగలు చూడంగానే చోరీ చేశామని ఆమె చెప్పింది.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 27 , 2024 | 10:47 PM