Viral: పెళ్లిలో వరుడిని చితక్కొట్టిన వధువు మాజీ బాయ్‌ఫ్రెండ్.. షాకింగ్ వీడియో
ABN, Publish Date - May 20 , 2024 | 07:47 PM
వధువు పెళ్లికి వచ్చిన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ వరుడిని ఇష్టారీతిన కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: వధువు పెళ్లి జరుగుతుండగా ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ.. అతడు తన మనసులో మాట బయటపెట్టడం.. అతడి మనసు తెలిసి వధువు కరిగిపోవడం.. ఇదంతా మన భారతీయ సినిమాల్లో పలుమార్లు కనిపించిన సీనే! అయితే, ఇంతకంటే షాకింగ్ ఘటన ఒకటి రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది. గర్ల్ ఫ్రెండ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సహించలేని ఓ వ్యక్తి పెళ్లి మండపంలోనే నానా యాగీ సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
ఘటన రాజస్థాన్‌లో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జంట వివాహం సందర్భంగా మరో యువకుడు వారితో ఫొటో దిగేందుకు స్టేజ్ మీదకు వెళ్లాడు. అతడు వధూవరుల స్నేహితుడయ్యుంటాడనుకున్న బంధువులు అతడి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇక స్టేజీ మీదకు వెళ్లాక ఆ యువకుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వధువు పక్కను కూర్చున్న వరుడిని ఇష్టారీతిన కొట్టాడు. ఇలా జరుగుతుందని ఊహించని వధువు దిమ్మెరపోయింది. అతడిని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇతర బంధువులు వచ్చి యువకుడిని నిలువరించేలోపే అతడు వరుడిని ఇష్టారీతిన కొట్టేశాడు. కాగా, వధువు, ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకే స్కూల్ లో పనిచేసే వారని తెలుస్తోంది (Womans ExBoyfriend Gatecrashing Her Wedding To Punch Groom).
Viral: 12 ఏళ్ల పాటు లాటరీ టిక్కెట్లు కొన్న మహిళకు జాక్ పాట్.. ఎంత గెలిచిందో తెలిస్తే..
ఈ షాకింగ్ దృశ్యాలు చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అనవసరంగా హింసకు దిగినందుకు మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పరిస్థితి ఎలాంటిదైనా హింసకు పాల్పడటం అస్సలు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. యువతియువకుల మధ్య ప్రేమలు నేటి తరంలో అవాంఛనీయ ఘటనలకు దారి తీస్తున్నాయని కొందరు విచారం వ్యక్తం చేశారు.
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ యువకుడు తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ పెళ్లికి ఇలాగే అడ్డుపడ్డాడు. పెళ్లి వేదికపైకి సడెన్‌గా వెళ్లి వధువు నుదుటిపై సింధూరం పెట్టాడు. ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబసభ్యులు అతడికి దేహశుద్ధి చేశారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2024 | 07:53 PM