Viral: కాళ్లకు క్రాకర్స్ కట్టుకుని చీర కట్టులో పిల్లి మొగ్గ వేసిన యువతి.. షాకింగ్ వీడియో! చివరకు..
ABN, Publish Date - Mar 24 , 2024 | 07:04 PM
హోలీ సందర్భంగా వైరల్ వీడియో చేద్దామనుకున్న ఓ యువతి చివరకు చిక్కుల్లో పడింది. చూసి తీరాల్సిన వీడియో ఇది.
ఇంటర్నెట్ డెస్క్: యావత్ భారత దేశం ప్రస్తుతం హోలీ పండుగకు సిద్ధమవుతోంది. మరోవైపు, కంటెంట్ క్రియేటర్లేమో హోలీ థీమ్‌తో రకరకాల వీడియోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. నెటిజన్ల దృష్టి ఆకర్షించేందుకు కొందరు ఎంతటి రిస్కైనా వెరవట్లేదు. ఇలాంటి ప్రయత్నాల్లో కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. దాదాపు అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతూ జనాలను బెంబేలెత్తిస్తోంది.
ఈ వీడియోలో ఓ యువతి చీర కట్టుకుని హోలీ స్టంట్ చేసేందుకు ట్రై చేసింది (Woman in saree does sommersault). తొలుత తన షూలకు హోలీ రంగుల పొగలు వెదజల్లే క్రాకర్స్‌ను చుట్టుకుంది. ఆ తరువాత షూస్‌కు ఉన్న క్రాకర్స్ రంగురంగుల పొగలు వెదజల్లుతుండగా ఓ రాడ్డు పట్టుకుని గాల్లో పిల్లిమొగ్గ వేసేందుకు ప్రయత్నించింది. అయతే రెండో పిల్లిమొగ్గ తరువాత ఆమె కిందకు దిగగానే క్రాకర్స్ నుంచి వచ్చే మంటలు చీరకు అంటుకున్నాయి. భయంతో ఆమె చిందులేస్తుండగా చుట్టుపక్కల ఉన్న వారు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, వీడియో అక్కడితో ఆగిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియరాలేదు (Saree on fire).
Break A Lock: వామ్మో..ఇదేం మ్యాజిక్ రా బాబూ.. తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే..
వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుండటంతో లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. జనాలు మాత్రం యువతిని విమర్శించారు. ఇలాంటి స్టంట్లు చేయడం రిస్క్‌తో కూడినదని అనేక మంది కామెంట్స్ చేశారు. ఆమె అభిమానులు కూడా పెదవివిరిచారు. ‘‘మీ రీల్స్ బాగుంటాయి గానీ ఇలాంటి పనులు మాత్రం వద్దు’’ అని అన్నారు. కంటెంట్ క్రియేటర్స్‌కు పిచ్చి పీక్స్‌లోకి వెళుతోందంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Diesel Bikes: ప్రపంచంలో డీజిల్ బైకులు ఎందుకు లేవో తెలుసా?
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 24 , 2024 | 07:10 PM