ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వామ్మో.. ఏకంగా మెట్రోలోనే ‘సంగీత్’ కార్యక్రమం పెట్టేశారుగా..!

ABN, Publish Date - Apr 28 , 2024 | 03:27 PM

ఢిల్లీ మెట్రోలో కొందరు మహిళలు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. కొందరు వారిని ప్రశంసిస్తే మరికొందరు విమర్శించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) కొందరు మహిళలు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. సాక్షి సింగ్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందిస్తుండటంతో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ (Viral) అవుతోంది.

ఈ వీడియో నెట్టింట కాలుపెట్టి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మెట్రోలో ఎక్కిన కొందరు మహిళలు ఏకంగా గానా బజానా కార్యక్రమం పెట్టేశారు. కొందరు డ్యాన్స్ చేస్తుంటే వారి చుట్టూ కూర్చున్న మహిళ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. డ్యాన్స్ చేస్తున్న ఓ మహిళ కూర్చున్న మరో మహిళను లేచి డ్యాన్స్ చేయాలంటూ బలవంతం చేయడం కూడా వీడియోలో రికార్డైంది. మహిళల డ్యాన్స్ చూసి మిగతా ప్రయాణికులు అందరూ నోరెళ్లబెట్టారు. వారి డ్యాన్స్ అలా మౌనంగానే చూస్తుండిపోయారు (Women Sing and Dance in Metro).

Viral: ఎంత మంచి మనసు బాసూ నీది.. అసలైన మనిషంటే నువ్వే!


ఇక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. ఏప్రిల్ 17న ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 50 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. జనాల కామెంట్లకూ అంతు లేకుండా పోయింది. కొందరేమో మహిళలపై ప్రశంసలు కురిపించారు. పాశ్చాత్య పోకడలు ఎక్కువగా ఉన్న మెట్రోలో భారతీయతను తీసుకొచ్చారంటూ కామెంట్ చేశారు. ‘‘భారతీయత ఉట్టిపడే చివరి తరం ఇదే. ఇలాంటి వాళ్లను భవిష్యత్తులో చూడలేం’’ అని అన్నారు. ఎటువంటి అసభ్యత లేకుండా ఉన్న వారి నృత్యం అద్భతమని కూడా వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు మాత్రం మహిళలను విమర్శించారు. ఈ మధ్య కాలంలో మెట్రోల్లో ప్రయాణికులు ఇలా ఇష్టారీతిన ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 03:36 PM

Advertising
Advertising