Viral: ఇంతకు తెగించారేంట్రా దేవుడా! ఈ యువతులు చేసిన దారుణం చూస్తే..
ABN, Publish Date - Oct 25 , 2024 | 06:03 PM
నోయిడాలో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. ఓ వృద్ధుడిపై ముందూ వెనకా ఆలోచించకుండా చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు యువతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నోయిడాలో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. ఓ వృద్ధుడిపై ముందూ వెనకా ఆలోచించకుండా చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు యువతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు కుక్కకు తాడు కట్టకుండా బయటకు తీసుకురావడంపై వృద్ధ దంపతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఇక్కడకొచ్చి తప్పు చేశానేమో! న్యూజిలాండ్‌లో భారతీయ యువకుడి ఆవేదన
నోయిడాలోని సెక్టర్ 78లోగల హైడ్ పార్క్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సొసైటీ కాంపౌండ్‌లో ఇద్దరు యువతులు పెంపుడు కుక్కకు తాడు లేకుండా తిప్పడం చూసిన వృద్ధ దంపతులు అభ్యంతరం తెలిపారు. దీంతో, వారి మధ్య మొదలైన వాగ్వాదం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. ఈ లోపల ఓ యువతి ముందూ వెనకా చూసుకోకుండా, పెద్దాయన చెంప పగలగొట్టింది. అక్కడే ఉండి ఇదంతా రికార్డు చేస్తున్న ఓ వ్యక్తి గగ్గోలు పెట్టాడు. ఇలా చేయొచ్చా అంటూ షాకైపోయాడు. అయినా కూడా వెనక్కు తగ్గని యువతి పెద్దాయనపై మరోసారి చేయి చేసుకుంది. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందో తెలియరాలేదు.
Viral: యువరాజ్ సింగ్ ఎన్జీవో యాడ్.. విమర్శలు
కాగా, ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాయనపై చేయి చేసుకోవడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతుల తీరును ఎండగట్టారు. మరోవైపు, ఢిల్లీలో ఇటీవల కాలంలో వికలాంగులపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలపై అక్కడి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కోర్టు త్వరలో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో యువతుల తీరు చర్చనీయాంశంగా మారింది. 2008లో దేశరాజధానిలోని తిలక్ నగర్‌లో ఐదు నెలల పసిపాప కుక్కల దాడిలో బలైన ఘటనకు సంబంధించి బిడ్డ తల్లికి ఢిల్లీ హైకోర్టు తాజాగా రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో లిఫ్టులోని బాలికపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. నాయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీలో మే నెలలో ఈ ఘటన జరిగింది. పెంపుడు కుక్కలు, ఊరకుక్కలకు సంబంధించి వివాదాలు తరచూ దేశంలో ఏదో మూల వెలుగులోకి వస్తున్నాయి.
Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..
Updated Date - Oct 25 , 2024 | 06:13 PM