Viral: లాబొరేటరీలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయోగం గురించి తెలిస్తే..
ABN, Publish Date - Nov 17 , 2024 | 06:46 PM
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో శాస్త్రవేత్తలు దాదాపు 100 ఏళ్ల నుంచి ఓ ప్రయోగం చేస్తున్నారు. మరో వందేళ్ల పాటు ఈ ప్రయోగం కొనసాగే అవకాశం ఉన్న ఈ ప్రయోగం అత్యంత సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు చేసే ప్రయోగాలు గంటలు లేదా రోజుల వ్యవధిలో పూర్తవుతాయి. శాస్త్రవేత్తలు చేసే భారీ ప్రయోగాలు కొన్ని నెలల పాటు సాగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న ఓ సుదీర్ఘ ప్రయోగం గురించి మీరెప్పుడైనా విన్నారా? అయితే, ఈ కథనం మీకోసమే (Viral).
దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రయోగాన్ని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. 1927లో థామస్ పార్నెల్ అనే ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త మొదలెట్టిన ఈ ప్రయోగాన్ని యూనివర్సిటీకి చెందిన తరువాతి తరం శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయోగం పూర్తయ్యేందుకు మరో శతాబ్దం పాటు పట్టే అవకాశం ఉండటంతో ఇది అత్యంత సుదీర్ఘ ప్రయోగంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది.
Canada: భారతీయ మహిళలపై కెనడా వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏమిటీ ప్రయోగం..
భౌతికశాస్త్రం ప్రకారం ఒక చోట నుంచి మరొక చోటకి ప్రవహించే వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. వీటిల్లో వాయువులు మొదలు ద్రవాలు వరకూ అనేకం ఉంటాయి. అయితే, ప్రపంచంలో అత్యంత చిక్కనైన ఫ్లూయిడ్‌గా పేరుగాంచిన పిచ్ అనే పదార్థంపై పార్నెల్ ఈ ప్రయోగం ప్రారంభించారు. చమురును శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే టార్ నుంచి ఈ ద్రవాన్ని తయారు చేస్తారు. ఫ్లూయిడ్స్‌కు ఉండే విస్కాసిటీతో పాటు ఇతర భౌతిక గుణాలను ముదింపు వేసేందుకు థామస్ పార్నెల్ ఈ ప్రయోగం చేపట్టారు.
Mike Tyson: మైక్ టైసన్ జీవితంలో ఆసక్తికర ఘటన! భారీ మగ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమై..
ఇందులో భాగంగా ఆయన తొలుత పిచ్‌ను ఓ ఫన్నల్ (గాజు గొట్టం)లో పోశారు. ఫన్నెల్ చివర ఉన్న సన్నని గొట్టం నుంచి బొట్లు బొట్లుగా కారే పిచ్‌ను పరిశీలించి చేసి దాని భౌతిక గుణాలను కొలవాలనేది లక్ష్యం. అయితే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిక్కటి ద్రవం కావడంతో ఫన్నల్ నుంచి తొలి బొట్టు పడేందుకు ఏకంగా ఎనిమిదేళ్లు పట్టింది. ఆ తరువాత మరో ఐదు బొట్లు పడేందుకు మరో 40 ఏళ్లు పట్టింది. థామస్ పర్నెల్ తరువాత జాన్ మెయిన్‌స్టోన్ ఈ ప్రయోగాన్ని కొనసాగించారు. ఆయన తదనంతరం ఈ ప్రయోగ బాధ్యతను ఇతర శాస్త్రవేత్తలు భుజానికెత్తుకున్నారు.
ప్రయోగం మొదలెట్టి 100 ఏళ్లు గడుస్తున్నా ఫన్నెల్ లో నుంచి తొమ్మిది చుక్కలు కిందకు కారాయంటే ఈ పదార్థం ఎంత చిక్కనైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన మరో వందేళ్ల పాటు ఈ ఎక్స్‌పరిమెంట్ కొనసాగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకూ ఫన్నల్ నుంచి బొట్టు కింద పడుతుండగా చూసినవారెవరూ లేకపోవడం ఈ ఉదంతంలో కొసమెరుపు. ఫన్నెల్ కింద ఉన్న ద్రవాన్ని బట్టి ఇన్ని బొట్లు పడిందని మాత్రం అంచనాకు వచ్చారు.
Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా
Updated Date - Nov 17 , 2024 | 06:54 PM