ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇగో అంటే ఇదే! ఖాళీగా ఉన్న మెట్రోలో ఈ యువకులు ఎలా రెచ్చిపోయారో చూస్తే..

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:43 PM

ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. బోగీలో బోలెడన్ని సీట్లు ఖాళీగా ఉన్నా ఇద్దరు యువకులు ఓ సీటు కోసం గొడవ పడటం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల మధ్య గొడవల తాలూకు వీడియోలు తెగ వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో విషయంలో ప్యాసెంజర్ల గొడవ పడుతూ హడావుడి చేస్తుంటారు. ఇలా పబ్లిక్‌గా బాహాబాహీకి దిగడం తప్పైనప్పటికీ వీటి వెనుక సహేతుకమైన కారణాలు ఉండేవి. కానీ, తాజా వీడియోలో మాత్రం అకారణంగా ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. మెట్రో బోగీ అంతా ఖాళీగా ఉన్నప్పటికీ వారు ఓ సీటు కోసం పరస్పరం కాలర్లు పట్టుకుని బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: రూ.70 లక్షల క్యాష్‌తో లగ్జరీ షాపులోకి వెళ్లిన మహిళ ఏం చేసిందో చూస్తే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు వ్యక్తులు సడెన్‌గా సీటు కోసం గొడవకు దిగారు. కాలర్లు పట్టుకుని ఒకరినొకరు తోసుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆ బోగీ చాలా మటుకూ ఖాళీగానే ఉన్నా, బోలెడన్నీ సీట్లు అందుబాటులో ఉన్నా కూడా ఆ ఇద్దరు వెనక్కు తగ్గలేదు. అదే సీటులో కూర్చుంటామంటూ గొడవకు దిగారు. పరస్పరం కాలర్లు పట్టుకున్న వారికి విడదీసేందుకు తోటి ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు.

ఇక నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను చూసిన జనాలు ఇదాంతా మూమూలే అంటూ లైట్ తీసుకున్నారు. అది ఢిల్లీ మెట్రో అక్కడ ఇదంతా సాధారణమే అని పులువురు కామెంట్ చేశారు. సీటు కోసం కొట్టుకోవడం మూర్ఖత్వం, ఇగో అని మరికొందరు కామెంట్ చేశారు. ఢిల్లీ మెట్రో అంటేనే ఎడతెగని గొడవల టీవీ సీరియల్‌ అని కొందరు అన్నారు. ఇద్దరికీ ఇగో ఎక్కువగా ఉందని కొందరు విమర్శించారు. ఢిల్లీ మెట్రోలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవే ఉండదని కూడా అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.


కాగా, గతంలో కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించి పలు ఉదంతాలు వైరల్‌గా మారాయి. ఓసారి సీటు కోసం గొడవకు దిగిన మహిళ ఏకంగా వెళ్లి ప్రయాణికుడి ఒళ్లో కూర్చుంది. నీవు సీటు లోంచి లేచేవారకూ ఇలాగే కూర్చుంటానంటూ మొండిపట్టు పట్టింది. దీంతో, అప్పట్లో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఇక మెట్రోలో యువ ప్రయాణికుల బహిరంగ ప్రేమప్రదర్శనలు, రీల్స్, షార్ట్ వీడియోల రికార్డింగ్‌లు లెక్కకు మిక్కిలి వైరల్ అయ్యాయి.

Read Viral and Telugu News

Updated Date - Aug 24 , 2024 | 04:50 PM

Advertising
Advertising
<