Viral: కారు కొనద్దన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెట్టింట విమర్శలు!
ABN, Publish Date - Oct 18 , 2024 | 10:18 PM
కారు కొనే బదులు ఆ మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడుల (ఎస్‌ఐపీ) వైపు మళ్లించాలన్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి సూచన సరైనది కాదని అనేక మంది కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కారు కొనే బదులు ఆ మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడుల (ఎస్‌ఐపీ) వైపు మళ్లించాలన్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి సూచన సరైనది కాదని అనేక మంది కామెంట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, డబ్బును పెట్టుబడులకు కాకుండా వస్తువుల కొనుగోలకు వినియోగిస్తే ఏం జరుగుతుందో చెబుతూ ఓ చిన్న కథను సౌరవ్ దత్తా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పుకొచ్చాడు (Viral).
Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!
‘‘ఉదాహరణకు.. ఓ వ్యక్తి నెలకు రూ.20 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఈఎమ్ఐలు చెల్లించి కారు కొనుగోలు చేద్దామనుకున్నాడని భావిద్దాం. అయితే, కారుకు బదులు ఈ రూ.20 వేలతో ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెడితే మరింత లాభం వస్తుందని నా అభిప్రాయం. ఎస్‌ఐపీల్లో పెట్టుబడితో ఐదేళ్ల తరువాత ఏకంగా రూ.17 లక్షలు కళ్ల చూడొచ్చు. కానీ కారు విలువ మాత్రం ఏకంగా రూ.4 లక్షలకు పడిపోతుంది. అంటే ఐదేళ్ల పాటు అతడు ఈఎమ్ఐల రూపంలో చెల్లించిన రూ.10 లక్షలు చివరకు రూ.4 లక్షలుగా మారిపోతాయి’’ అని వివరించాడు.
Viral: మనిషంటే నువ్వే బాసూ! అచేతనంగా పడున్న పామును ఎలా కాపాడాడో చూడండి!
అతడి ట్వీట్‌పై ఒక్కసారిగా చర్చ మొదలవటంతో ఈ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. జీవితానికి అర్థం కేవలం పెట్టుబడులు మాత్రమే కాదని కాస్త లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయాలని కొందరు చెప్పుకొచ్చారు. అందరూ ఇలా కొనుగోళ్లు తగ్గించి పెట్టుబడులు పెడుతూ ఉంటే స్టాక్‌మార్కెట్‌లో అభివృద్ధి ఉండదని మరో వ్యక్తి అన్నాడు. కరోనా సంక్షోభం లాంటి సమయాల్లో ప్రజారవాణా అందుబాటులో లేనప్పుడు సొంత వాహనాలే దిక్కవుతాయని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
Updated Date - Oct 18 , 2024 | 10:22 PM