Share News

Viral: ఈ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజూ చేసేది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెట్టింట గగ్గోలు!

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:13 PM

ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి రోజువారి దిన చర్యకు సంబంధించిన టైం టేబుల్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: ఈ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజూ చేసేది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెట్టింట గగ్గోలు!

ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల శ్రమ మామూలుగా ఉండదు. తమ కలలను సాకారం చేసుకునేందుకు వాళ్లు ఎవ్వరూ ఊహించని స్థాయిలో కష్టించి పనిచేస్తారు. అందుకే ఓ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజువారి టైం టేబుల్ ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది. అతడి స్నేహితుడే స్వయంగా ఈ టైం టేబుల్‌ను (IIT Jee Student Time table) షేర్ చేశాడు.

Exercise Pill: ఈ టాబ్లెట్ వేసుకుంటే జిమ్‌కు వెళ్లక్కర్లేదు! కాలు కదపకుండానే కసరత్తుల బెనిఫిట్స్!


Mr. Rc అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఓ టీనేజర్... ఐఐటీ జేఈఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న తన స్నేహితుడి షెడ్యూల్‌ను అప్‌లోడ్ చేశాడు. ఆ షెడ్యూల్ ప్రకారం, అతడు ఉదయం 4.30లకే లేస్తాడు. ఆ తరువాత గంటన్నర పాటు మునుపటి రోజు పాఠాలు పునశ్చరణ చేసుకుంటాడు. ఆ తరువాత కాలకృత్యాలకు మరో అరగంట కేటాయిస్తాడు. అనంతరం చదువులో నిమగ్నమవుతాడు. ఉదయం 10 గంటలకు పదిహేను నిమిషాల పాటు చిన్న కునుకు తీస్తాడు. అంటే పవర్ నాప్ అన్నమాట. ఆ తరువాత మళ్లీ పుస్తకాలతో కుస్తీ మొదలవుతుంది.

Viral: హాస్టల్‌ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! పోలీసులు వచ్చి చూస్తే..

మధ్యాహ్నం లంచ్‌కు అతడు 20 నిమిషాలే కేటాయిస్తాడు. అక్కడి నుంచీ మళ్లీ చదువులు మొదలు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.00 నుంచి 3.15 వరకూ ఓ పవర్ నాప్.. ఆ తరువాత మళ్లీ చదువులతో కుస్తీ..రాత్రి 9.00 నుంచి 9.30 వరకూ డిన్నర్.. ఆ తరువాత రాత్రి 12.00 వరకూ మళ్లీ చదువులు. అంతేకాదు. తనలో రోజంతా ఉత్సాహం కొనసాగేలా చేసేందుకు షెడ్యూల్ కింద ఓ కొటేషన్ కూడా రాసుకున్నాడు. ‘‘ఈ రోజు మళ్లీ రాదు..నువ్వు చేయగలిగిందంతా చేయి’’ అని కూడా రాసుకున్నాడు (IIT Jee Student Time table).

Viral: దేవుడా.. ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మహిళ ఎలాంటి పని చేసిందో చూస్తే..


పేదరికంలో కూరుకుపోయిన తన కుటుంబాన్ని ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన స్నేహితుడు ఇంత కష్టపడుతున్నాడని ఆ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఈ షెడ్యూల్ నెట్టింట ప్రస్తుతం విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది. అనేక మంది ఆ విద్యార్థి హార్డ్‌వర్క్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది మాత్రం అంత శ్రమ వద్దంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. టీనేజ్ వయసులో ఇంత తక్కువ నిద్రపోతే రాబోయే రోజుల్లో అతడి మెదడు సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు. అతడి షెడ్యూల్‌లో ఎక్సర్‌సైజులు కూడా భాగం కావాలని కొందరు సూచించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 05:18 PM