Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!
ABN, Publish Date - Dec 09 , 2024 | 08:25 PM
ఓ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఒక ప్రశ్నకు యస్ చెప్పిన వంద మంది ఉద్యోగం ఉన్న ఫళంగా ఊడిపోయిందట. ఇది ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఉద్యోగావకాశాలు పెరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఉద్యోగ భద్రత కూడా గాల్లో దీపంగా మారింది. రెండు చేతులా సంపాదిస్తున్నా కూడా దీర్ఘకాలిక ప్రణాళికలు వేయలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీని ఉద్యోగాల్లో నిత్యం అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. సంస్థ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఓ ప్రశ్నకు యస్ చెప్పిన వంద మంది ఉద్యోగం ఉన్న ఫళంగా ఊడిపోయిందట (Viral).
Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!
జాతీయ మీడియా కథనాల ప్రకారం, యస్ మేడమ్ అనే స్టార్టప్ సంస్థ ఇంటి వద్ద సెలూన్ సర్వీసులు అందిస్తుంటుంది. అయితే, ఇటీవల సంస్థ హెచ్‌ఆర్ విభాగం అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించిందట. అధిక పని కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా అంటూ ఉద్యోగుల మీదకు ఓ ప్రశ్న సంధించిందట. ఒత్తిడి ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనంటూ కొందరు సమాధానమిచ్చారట.
ఇది జరిగిన కొన్ని రోజులకు సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ నుంచి కొందరు ఉద్యోగులకు ఈమెయిల్ వెళ్లింది. సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాలను గౌరవిస్తామంటూనే సంస్థ యాజమాన్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి తప్పనిసరి పరిస్థితుల్లో వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించింది.
Viral: వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!
‘‘డియర్ టీం.. పని ప్రదేశంలో ఉద్యోగుల ఒత్తిడి గురించి తెలుసుకునేందుకు మేము ఓ సర్వే నిర్వహించాము. మీలో చాలా మంది తమ అభిప్రాయాలు పేర్కొన్నారు. వాటికి మేము చాలా విలువ, గౌరవం ఇస్తున్నాము. అయితే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధపెట్టే సంస్థగా, వారికి అండగా నిలచే సంస్థగా మేము ఈ అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించాము. ఈ నెపథ్యంలో ఉద్యోగుల మేలు కోసం, అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి వీడ్కోలు పలికేందుకు నిర్ణయించాము. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ప్రభావిత ఉద్యోగులను పూర్తి వివరాలతో సంప్రదిస్తాము’’ అని ఈమెయిల్ వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. అసలు ఇదంతా నిజంగా జరిగిందా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే, ఘటనపై సంస్థ మాత్రం ఇంకా స్పందించలేదు.
Updated Date - Dec 09 , 2024 | 08:31 PM