Viral News: అద్భుతం.. చంపి బొంద పెట్టినా లేచి వచ్చింది.. దీనివల్లే సాధ్యమైందట..
ABN, Publish Date - Nov 08 , 2024 | 07:52 PM
భర్తతో పాటు యోగా ఉపాధ్యాయురాలు సన్నిహితంగా ఉండడంపై ఆ భార్య అనుమాన పడింది. తన భర్త నుంచి ఆమెను దూరం చేయడంలో సహాయం చేయాలని తన స్నేహితుడిని కోరింది. అందుకు అతడు సహయం చేశాడు. ఆ క్రమంలో ఆ యోగా ఉపాధ్యాయురాలని కిడ్నాప్ చేశారు. అనతరం ఆమెను హత్య చేసి గోతిలో పడేశారు. కానీ ఆమె తిరిగి బయటకు వచ్చింది. అది ఎలాగంటే..
ఓ మనిషి జీవితంలో ఏదైన శిక్షణ పొందితే.. అది వారి జీవిత కాలంలో ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ కచ్చితంగా ఉపయోగపడి తిరుతుంది. అందుకు సజీవ తార్కాణం ఇటీవల కర్ణాటకలో ఓ ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. యోగా శిక్షణ ఇచ్చే ఓ మహిళ ఉపాధ్యాయురాలు మరణం అంచు వరకు వెళ్లి.. క్షేమంగా ప్రాణాలతో బయట పడింది.
యోగా టీచర్ కిడ్నాప్..
దేవనహళ్లి సమీపంలో సదరు మహిళా ఉపాధ్యాయురాలను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లారు. ఆ తర్వాత దుస్తులు విప్పాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారు. దీంతో చేసేది లేక.. ఆ మహిళ దుస్తులు విప్పింది. దీంతో ఆమె మెడకు వైర్ బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె చాలా సమయస్పూర్తితో వ్యవహరించింది.
Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు
సమయ స్ఫూర్తితో వ్యవహరించి..
యోగా శిక్షణలోని మెళుకువలన్నీ తెలిసిన ఆమె గట్టిగా ఊపిరి బిగబట్టింది. దీంతో ఆమె చనిపోయిందని కిడ్నాపర్లంతా భావించారు. అనంతరం ఆ సమీపంలోని పెద్ద గొయ్యిలో ఆమెను పడేశారు. అయితే ఆ సమయంలో ఆమె శరీరంపై కొద్ది పాటి మట్టిని మాత్రమే వేశారు. ఆ తర్వాత వారంత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
ప్రాణాలు అరచేతితో పట్టుకుని..
ఆ కొద్ది సేపటి తర్వాత.. ఆమె గొయ్యి నుంచి బయటకు వచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లోని తన దుస్తులను సేకరించి ధరించింది. అనంతరం ఎలాగోలా చిక్కబళ్లాపూర్ ప్రాంతంలో సిడ్లఘట్టలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత పోలీసులను ఆమె ఆశ్రయించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళతోపాటు యువకుడు సైతం ఉండడం గమనార్హం.
Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?
ఇంతకీ ఏం జరిగిందంటే..?
పోలీసులు అరెస్ట్ చేసిన మహిళ పేరు బింధు (27). ఆమె సూచన మేరకు ఆ యోగా ఉపాధ్యాయురాలను కిడ్నాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. తన భర్త సంతోష్‌కుమార్‌తో యోగా ఉపాధ్యాయురాలు చాలా సన్నిహితంగా మెలుగుతుంది. దీంతో వారిపై బింధు అనుమాన పడింది. ఆ క్రమంలో బెంగళూరులో డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న తన స్నేహితుడు సతీశ్ రెడ్డిని సహాయం చేయ్యాలని బింధు కోరింది. అందుకు అతడు ఒప్పుకున్నాడు.
Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
సతీశ్ రెడ్డి సాయం..
దీంతో తాను యోగా నేర్చుకుంటానంటూ సదరు ఉపాధ్యాయురాలితో స్నేహం చేయడం ప్రారంభించాడీ సతీశ్ రెడ్డి. దీంతో అక్టోబర్ 23వ తేదీన ఉదయం ఆమె నివాసానికి సతీశ్ రెడ్డి వెళ్లాడు. తన ఇంటి సమీపంలో రైఫిల్ షూటింగ్ సెషన్‌కు తనతో పాటు రావాలని ఆమెను కోరాడు. ఆమెను.. తన కారులో ఎక్కించుకుని కొంత దూరం వెళ్లారు. అనంతరం ముగ్గురు పురుషులతోపాటు ఓ యువకుడు సైతం ఆ కారు ఎక్కారు. ఆ తర్వాత సిడ్లఘట్ట తాలూకాలోని ధనమిత్తెనహళ్లి అటవీ ప్రాంతంలోని వెళ్లారు. అక్కడ యోగా ఉపాధ్యాయురాలను వారంతా బెదిరించి.. బట్టలు విప్పించారు. అనంతరం కేబుల్ సహాయంతో ఆమె గొంతు కోసి హత్య చేయాలని ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె ఊపిరి గట్టిగా బిగబట్టడంతో.. చనిపోయిందని అంతా భావించారు. దాంతో ఆమెను గోతిలో పాతిపెట్టి వారంతా వెళ్లిపోయారని పోలీసులు వివరించారు. అయతే ప్రస్తుతం ఈ న్యూస్ కర్ణాటకలో వైరల్‌గా మారింది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 08 , 2024 | 07:52 PM