ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇదేం పని తల్లీ.. స్కూటీపై వెళుతున్న మహిళను చూసి జనాలు షాక్..!

ABN, Publish Date - May 09 , 2024 | 09:40 PM

హెల్మెట్‌ను అపసవ్యంగా పెట్టుకుని ట్రాఫిక్‌లో దూసుకుపోతున్న మహిళ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. కొందరు మహిళ తీరుకు నవ్వుకుంటుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రమాద సమయాల్లో ప్రాణాలు కాపాడే హెల్మెట్ అంటే అనేక మంది వాహనదారులకు ఎంతటి నిర్లక్ష్యమో మాటల్లో చెప్పడం కష్టం. కొందరు హెల్మెట్ అసలు వెంట తెచ్చుకోరు. కొందరేమో ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే కాసేపు హెల్మెట్ పెట్టుకుని ఆ తరువాత తీసేస్తారు. మరికొందరు మాత్రం హెల్మెట్‌‌ను ఇష్టారీతిన పెట్టుకుంటారు. ఈ కోవకు చెందిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌గా (viral) మారింది.

స్కూటీపై వెళుతున్న మహిళ వీడియో ఇది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మహిళ వెనక వెళుతున్న ఓ వ్యక్తి ఆమె హెల్మెట్ పెట్టుకున్న తీరు చూసి షాకైపోయాడు. హెల్మెట్ తన తలను తినేస్తున్నట్టు ఆమె హెల్మెట్ ధరించింది. తను చేస్తున్నది తప్పని తెలిసీ బిందాస్‌గా ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తోంది. ఇది చూసి షాకైపోయిన వ్యక్తి వీడియోను నెట్టింట పంచుకోవడంతో జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది (Kanpur woman's wierd way of wearing helmet).

Viral: జిరాఫీ మెడను సెట్ చేసిన డాక్టర్! ఇలాంటి చికిత్స మీరెక్కడా చూసుండరు!


వీడియో చూసిన అనేక మంది మహిళ తీరుకు షాకైపోయారు. మహిళ తీరు ప్రమాదకరంగా ఉందని కొందరు కామెంట్ చేశారు. హెల్మెట్ పట్ల ఇలాంటి నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పవని కొందరు హెచ్చరించారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కొందరు మార్పు తెచ్చుకోక ప్రమాదాల్లో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి మాత్రం ఇది ఫన్నీగా అనిపించడంతో పడీ పడీ నవ్వుకున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అంటూ సరదా కామెంట్స్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:47 PM

Advertising
Advertising