ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: శుభమా అంటూ కొత్త రైలు కదులుతుండగా.. ఇంజిన్ ఎదురుగా వచ్చిన యువతి.. ఆమె నిర్వాకానికి అవాక్కైన డ్రైవర్లు..

ABN, Publish Date - Jan 12 , 2024 | 09:49 PM

కొందరు బస్సులు, రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటుంటారు. ఎలాగైనా ఏదోటి చేసి నెట్టింట వైరల్ అవ్వాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో

కొందరు బస్సులు, రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటుంటారు. ఎలాగైనా ఏదోటి చేసి నెట్టింట వైరల్ అవ్వాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరిని చూస్తే కోపం వస్తే.. మరికొందరిని చూస్తే నవ్వు వస్తుంటుంది. ఇలాంటి యువతీయువకులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కొత్త రైలును ప్రారంభించే ముందు ఓ యువతి ఇంజిన్ ఎదురుగా వచ్చి డ్రైవర్లకు షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త రైలుకు ( new train) పూల మాలలతో అలంకరించి, ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులు ఎక్కగానే లోకోపైలెట్లు ఇంజిన్ వద్దకు వస్తారు. అయితే ఇంతలో ఓ యువతికి విచిత్రమైన ఐడియా వచ్చింది. రైలును తన డ్యాన్స్‌తో ప్రారంభిస్తే.. పనిలో పనిగా తానూ సోషల్ మీడియాలో వైరల్ అవుతానని అనుకుందో ఏమో గానీ.. (woman dancing in front of train engine) ఇంజిన్ సమీపానికి వెళ్లి డాన్స్ మొదలెడుతుంది.

Viral Video: కొండపై 10అడుగుల వింత మనుషులు.. ఏలియన్స్ అని అనుమానిస్తుండగానే.. మరో షాక్..

ఇంజిన్ పైకి ఎక్కుతున్న లోకోపైలెట్లు ఆమె డ్యాన్స్ చూసి అవాక్కవుతారు. కాసేపు ఆమె డాన్సును చూసి నవ్వుకుంటారు. ‘‘ఏంటో.. ఈ అమ్మాయిలకు రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అని అనుకుంటూ రైలును స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పుడు రైలు అత్యధిక వేగంతో వెళ్తుంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రయాణికులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 40వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కింగ్ కోబ్రాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ స్నేక్ క్యాచర్ ఏం చేశాడో చూడండి..

Updated Date - Jan 12 , 2024 | 09:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising