ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇది శాడిస్టు కోతిలా ఉందే.. యువతి విదేశీ ప్రయాణానికే ఎసరుపెట్టింది.. చూస్తుండగానే ఎంత పని చేసిందంటే..

ABN, Publish Date - Jan 19 , 2024 | 07:20 PM

కోతులు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే ఏకంగా గుండె ఆగిపోయేంత పని అవుతుంటుంది. పర్యాట ప్రదేశాల్లో...

కోతులు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే ఏకంగా గుండె ఆగిపోయేంత పని అవుతుంటుంది. పర్యాట ప్రదేశాల్లో వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి ఇస్తే.. మరికొన్నిసార్లు విసిరిపడేస్తుంటాయి. ఇలాంటి కోతులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కోతి చేసిన పని చూసి యువతి షాక్ అయింది. యువతి పాస్ పోర్టును లాక్కున్న కోతి చివరికి ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొందు పర్యాటకులు (Tourists) బాలిలోని పర్యాటక ప్రాంతాలను వీక్షిస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువతి (young woman) అడవి సమీపంలోని వ్యూ పాయింట్ వద్ద నిలబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. కొన్ని కోతులు అక్కడ ఉన్న ఇనుస గేటుపై కూర్చుని, పర్యాటకులు ఇచ్చే ఆహారపదార్థాల కోసం ఎదురు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఓ కోతి అక్కడున్న యువతి బ్యాగులోని పాస్‌పోర్టు పుస్తకాన్ని ఎత్తుకెళ్లింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.

Viral Video: విమానంలో లగేజీ పెడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో చూడండి..

వెంటనే తన పాస్‌పోర్టును తిరిగి తీసుకునే క్రమంలో కోతి వెనుకే వెళ్తుంది. ఇనుప గేటుపై కూర్చున్న కోతి వద్దకు వెళ్లి.. ఇంకో పాత పుస్తకాన్ని అందించి, తన పాస్‌పోర్టు పుస్తకాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పటికే కోపంలో ఉన్న కోతి.. (monkey tore up the passport) ఆమె చూస్తుండగానే పుస్తకాన్ని చింపేస్తుంది. దీంతో యువతి మరింత కంగారుపడుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో! ఈ కోతి ఎంత పని చేసిది’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఆమెకు ఊహించని అనుభవం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 93వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జింక కోసం ప్రాణాలకు తెగించిన కుక్క.. నది అవతలి ఒడ్డుకు వెళ్లి చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Jan 19 , 2024 | 07:20 PM

Advertising
Advertising