Viral Video: గడ్డ కట్టే మంచులో పొగలు కక్కే కాఫీ.. వీళ్ల అతి తెలివి చూస్తే అవాక్కవకుండా ఉండలేరు..
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:28 PM
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గడ్డ కట్టే చలిలోలోనూ కొందరు ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంటారు. మరికొందరు ...
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గడ్డ కట్టే చలిలోలోనూ కొందరు ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంటారు. మరికొందరు ఆ మంచుతో వివిధ రకాల ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గడ్డ కట్టే చలిలో కొందరు వేడి వేడి కాఫీ చేసుకుని తాగుతూ ఎంజాయ్ చేశారు. అయితే కాఫీ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు సాహస యాత్రికులు జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) వెళ్లారు. అక్కడి నదిపై కూర్చుని గడ్డ కట్టే చలిలో ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్రమంలో (hot coffee Making in the ice area) వారికి వేడి వేడి కాఫీ తాగాలి అనిపించింది. అందుకోసం వారి వద్ద చిన్నసైజు గ్యాస్ పొయ్యి, మిగతా వస్తువులన్నీ ఉన్నాయి. అయితే నీళ్లు మాత్రం లేవు. దీంతో చివరకు వారికి ఓ ఐడియా వచ్చింది. ‘‘చుట్టూ ఇంత మంచు ఉంచుకుని.. నీటితో పనేముందీ’’.. అని అనుకుంటూ పక్కనే ఉన్న మంచు గడ్డలను తీసుకుని వంట పాత్రలో వేశారు.
తర్వాత స్టవ్ మండించడంతో ఆ మంచు కాస్త క్షణాల్లో నీళ్లలా మారిపోయింది. తర్వాత అందులో కాఫీ పొడి, చక్కెర తదితరాలు వేసి చివరకు వేడి వేడి కాఫీని సిద్ధం చేశారు. తర్వాత అంతా కలిసి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశారు. చుట్టూ పెద్ద పద్ద వృక్షాల మధ్య ఉన్న ఆ లోయ ప్రాంతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా!.. ఐడియా అదుర్స్ బ్రో’’.. అంటూ కొందరు, ‘‘గడ్డ కట్టే చలిలో వేడి వేడి కాఫీ.. సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Feb 13 , 2024 | 04:28 PM