Viral: ఏనుగు హింట్ ఇస్తున్నా వినలేదు.. చివరకు ఇతడికి ఎలాంటి గతి పట్టిందంటే..
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:10 PM
ఏనుగుతో రీల్స్ చేసేందుకు దానికి పదే పదే దగ్గరగా జరిగిన ఓ యువకుడి ఆ గజరాజం భారీ షాకిచ్చింది. ఒక్కసారిగా తొండంతో తోయడంతో కొన్ని అడుగుల దూరంలో వెళ్లి పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అడవి జంతువులు ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పడం కష్టమే. అయితే, అవి నిత్యం తమ అసహనాన్ని, చిరాకును వివిధ సంకేతాల రూపంలో తెలియజేస్తుంటాయి. తెలివి నేర్చిన మనుషులుగా ఆ సంకేతాలను, హింట్స్‌ను అర్థం చేసుకుని మసులు కోవడం మన విధి. కానీ కొందరు ఇలాంటివేవీ పట్టించుకోరు. వాటి ఇబ్బందిని అసలేమాత్రం పట్టించుకోకుండా సహనానికి పరీక్ష పెడతారు. ఇలాంటి వారికి ఏదోక రోజు దిమ్మతిరిగే షాక్ తగులుతుందని చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. వీడియోలో ఏనుగు చేసిన పని చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: ఇలాక్కూడా జరుగుతుందా? ఫ్రెండ్ జాక్‌పాట్ చూసి లాటరీ టిక్కెట్ కొంటే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు ఏనుగుతో రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం అతడు మొదటగా దానికి కొంత మేత వేశాడు. అలవాటు ప్రకారం, ఏనుగు యువకుడు ఇచ్చిన మేతను ముచ్చటగొలిపేలా తొండంతో అందుకుని తినేసింది. ఈ క్రమంలో అతడు ఓసారి దాన్ని తొండం తాకాడు. ఏనుగుకు అది ఇష్టం లేకపోవడంతో వెనక్కు జరిగింది. కానీ మనోడు మాత్రం దాన్ని వదల్లేదు. తొండంపై చేయి నిలబడి ఫోజు ఇస్తూ రీల్స్ రికార్డు చేయాలనేది అతడి ప్లాన్. ఇందుకు అనుగుణంగా అతడు మళ్లీ ఏనుగు దగ్గరగా జరిగి మళ్లీ దాని తొండంపై చేయి వేశాడు. మళ్లీ ఏనుగు వెనక్క జరగ్గా యువకుడు మళ్లీ ముందడుగు వేశాడు (Youth feeds elephant for reels purpose what jumbo did is shocking).
అన్ని సార్లు చెప్పినా యువకుడు వినకపోవడంతో ఏనుగుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. దీంతో, అతడిని ఒక్కసారిగా తొండంతో తోసింది. ఆ దెబ్బకు యువకుడు వెనక్క వెల్లి ఎల్లకిలా పడ్డాడు. ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు యువకుడికి తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు. కంటెంట్ కోసం ఏనుగుతో ఎగసెక్కాలాడితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. కంటెంట్ కోసమేనా లేక దాని కడుపు నింపేందుకు నిస్వార్థంగా ఏదైనా చేసే ఆలోచన ఉందా? అని మరికొందరు ప్రశ్నించారు. అడవి జంతువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిసీ కొందరు ఎందుకు ఇలాంటి రిస్క్ చేస్తారో అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Jun 13 , 2024 | 04:11 PM