Viral: నిమిషానికి 300 పదాల స్పీడుతో టైపింగ్! జడివాన పడ్డట్టు శబ్దం!
ABN, Publish Date - Jun 07 , 2024 | 07:31 PM
నిమిషానికి 40 పదాల స్పీడుతో టైప్ చేయాలంటేనే వేళ్లు నొప్పులు పుట్టేస్తాయి. వేళ్ల ఊడొస్తాయేమో అని అనిపిస్తుంది. అలాంటిది నిమిషానికి 300 పదాల స్పీడుతో టైప్ చేస్తే సొమ్మసిల్లిపోవాల్సిందే. అసలు ఇలాంటి ఫీట్ సాధ్యమేనా అని అంటారా? యస్.. కచ్చితంగా సాధ్యమేనని నిరూపించాడో టీనేజర్.
ఇంటర్నెట్ డెస్క్: నిమిషానికి 40 పదాల స్పీడుతో టైప్ చేయాలంటేనే వేళ్లు నొప్పులు పుట్టేస్తాయి. వేళ్ల ఊడొస్తాయేమో అని అనిపిస్తుంది. అలాంటిది నిమిషానికి 300 పదాల స్పీడుతో టైప్ చేస్తే సొమ్మసిల్లిపోవాల్సిందే. అసలు ఇలాంటి ఫీట్ సాధ్యమేనా అని అంటారా? యస్.. కచ్చితంగా సాధ్యమేనని నిరూపించాడో టీనేజర్. అతడు టైప్ చేస్తుంటే కంప్యూటర్ స్క్రీన్‌పై అక్షరాలు మెరుపు వేగంతో ప్రత్యక్షమవుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఈ కుర్రోడు మనిషేనా లేక రోబోటా అన్న సందేహాలు కూడా నెట్టింట వ్యక్తమవుతున్నాయి.
ఎవ్వరికీ సాధ్యం కాని ఈ ఫీట్ చేసిన టీనేజ్ సెన్సేషన్ ఓ యూట్యూబర్. మిథికల్ రాకెట్ పేరిట ఉన్న అతడి ఛానల్‌లోని కంటెంట్ నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది. తాజాగా అతడు నిమిషానికి 300 పదాల పైచిలుకు స్పీడును అందుకున్న వీడియోను షేర్ చేశారు. అతడు టైప్ చేస్తుంటే పెద్ద జడివాన పడుతున్నట్టు శబ్దాలు వస్తుంటే కంప్యూటర్ స్క్రీన్‌పై మెరుపు వేగంతో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసి జనాలు షాకైపోతున్నారు. తను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టానని కూడా అతడు చెప్పుకొచ్చాడు (YouTuber Achieves Typing Speed Of Over 300 Words Per Minute).
Viral: ఎంత క్రమశిక్షణ.. ఈ కుక్కను చూసైనా మనుషులకు బుద్ధొస్తే బాగుండును!
మూడేళ్ల క్రితం తాను టైపింగ్ స్పీడు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. నిత్యం ప్రాక్టీసు చేసేవాణ్ణని అన్నాడు. ఒకానొక దశలో తన స్పీడు 140కి చేరుకుందన్నాడు. నిత్యం వీడియో గేములు ఆడటం కూడా కొంత వరకూ టైపింగ్ స్పీడు పెరిగేందుకు ఉపయోగ పడిందన్నాడు.
క్రమక్రమంగా తన వేగం పెంచుకుంటూ వెళ్లాన్నాడు. 150, 160.. ఇలా స్పీడు పెరుగుతూ పోయిందని చెప్పాడు. లక్ష్యం చేరుకున్న ప్రతిసారీ మరింత కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగానని అన్నాడు. మంకీటైప్, టైప్‌రేసర్ వంటి రాకెట్ టూల్స్ ద్వారా నిత్యం ప్రాక్టీసు చేసేవాణ్ణని అన్నాడు. తాజాగా అతడి వేగం 305 స్పీడును దాటింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Updated Date - Jun 07 , 2024 | 07:31 PM