Youtuber: ఎయిర్‌పోర్టులో దూరి ఆ పని చేసిన యూట్యూబర్.. అడ్డంగా బుక్
ABN, Publish Date - Apr 18 , 2024 | 01:48 PM
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్స్ రాబట్టుకోవడం కోసం జనాలు రకరకాల స్టంట్స్ చేసి.. ఆ వీడియోలను నెట్టింట్లో పెడుతుంటారు. చివరికి లక్షల్లో ఫాలోవర్లు కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం.. అప్పుడప్పుడు ప్రయోగాల పేరుతో కాస్త హద్దుమీరుతుంటారు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో
ప్రస్తుత సోషల్ మీడియాలో (Social Media) యుగంలో వ్యూస్, లైక్స్ రాబట్టుకోవడం కోసం జనాలు రకరకాల స్టంట్స్ చేసి.. ఆ వీడియోలను నెట్టింట్లో పెడుతుంటారు. చివరికి లక్షల్లో ఫాలోవర్లు కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం.. అప్పుడప్పుడు ప్రయోగాల పేరుతో కాస్త హద్దుమీరుతుంటారు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో, ఏదో వినూత్నంగా చేయాలన్న ఆలోచనతో.. దుస్సాహసాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ యూట్యూబర్ కూడా అదే పని చేశాడు. టికెట్ లేకుండానే రన్‌వే పైకి వెళ్లి.. ఒక వీడియో రికార్డ్ చేసి.. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆమిర్ ఖాన్ డీప్‌ఫేక్ వీడియో వివాదం.. ఇంతకీ అందులో ఏముందంటే?
అతని పేరు వికాస్ గౌడ (Vikas Gowda). యూట్యూబ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన ఈ 23 ఏళ్ల యూట్యూబర్.. ఏప్రిల్ 12వ తేదీన ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. అందులో తాను టికెట్ లేకుండానే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Kempegowda Airport) రన్‌వే పైకి వచ్చానని పేర్కొన్నాడు. 24 గంటల పాటు తాను అక్కడే ఉన్నానని.. అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి తాను ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో చక్కర్లు కొట్టానని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ.. సీఐఎస్ఎఫ్ కంటపడింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడ్ని అరెస్ట్ చేశారు. అధికారులు అతడ్ని విచారించగా.. తాను టికెట్ కొనుగోలు చేసి లోపలికి వెళ్లానన్నాడు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో వీడియో రికార్డ్ చేశాక.. తన ఫ్లైట్ మిస్ అయ్యిందని భద్రతా సిబ్బందికి చెప్పానని, తన వద్ద టికెట్‌తో పాటు బోర్డింగ్ పాస్ ఉండటంతో వారికి అనుమానం రాలేదన్నాడు. పబ్లిసిటీ కోసమే అతడు ఈ పనికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
ఈ వ్యవహారంపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. వికాస్ ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన తర్వాత టెర్మినల్-2 వద్ద భద్రతా తనిఖీని క్లియర్ చేసి, బోర్డింగ్ లాంజ్ వైపు వెళ్లాడన్నారు. కానీ.. అతడు విమానం ఎక్కకుండా, ఎయిర్‌పోర్టు ఆవరణలో తిరుగుతూ దాదాపు ఆరు గంటలపాటు గడిపాడని చెప్పారు. కాగా.. వికాస్ రికార్డ్ చేసిన వీడియో ఏప్రిల్ 15న ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది దృష్టికి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అతనిపై భారత శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్ 505, 448 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. ఆ తర్వాత వికాస్ బెయిల్‌పై విడుదల అయ్యాడని అధికారులు వెల్లడించారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 01:48 PM