ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇలాంటోళ్ల వల్లే సోషల్ మీడియాలో భారత్ ఇమేజ్ పెరిగేది.. వైరల్ వీడియో!

ABN, Publish Date - Oct 27 , 2024 | 06:59 PM

భారతీయ వంటకాలపై చైనా యువతి చేసిన విమర్శలను ఓ ఇండియన్ యూట్యూబర్ హుందాగా ఖండించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో కొందరు విదేశీ కంటెంట్ క్రియేటర్లు పనిగట్టుకుని భారత వ్యతిరేక వీడియోలు పోస్టు చేస్తుంటారు. తమ మాతృదేశంపై విమర్శలు తట్టుకోలేక భారతీయులు పెద్ద ఎత్తున స్పందించి భారీగా వ్యూస్, డబ్బులు తెచ్చిపెడతారనే వ్యూహంతో ఇలా చేస్తుంటారు. అయితే, భారతీయ యూట్యూబర్లు దీన్ని తమదైన శైలిలో అడ్డుకుంటూ ఉంటారు. తాజాగా ఓ చైనా యువతి భారతీయ వంటకాలపై చేసిన విమర్శలను ఓ ఇండియన్ యూట్యూబర్ హుందాగా ఖండించిన తీరు నెట్టింట వైరల్‌గా (viral) మారింది.

Viral: ప్రపంచంలో తొలిసారిగా ‘డిజిటల్ కండోమ్‌’ను రూపొందించిన జర్మన్ కంపెనీ!


పరమ్‌వీర్ అనే యూట్యూబర్ ఓ చైనా యువతి విమర్శలను తన వీడియోలో హుందాగా తిప్పికొట్టాడు. తొలుత చైనా యువతి భారతీయ వంటకాలు అపరిశుభ్రంగా ఉంటాయని విమర్శించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలను తన వాదనకు ఆధారాలుగా చూపించింది. ఆమె చూపించిన వీడియోల్లో ఓ వ్యక్తి కాళ్లతో టామాలను చిదుముతాడు. మరో వ్యక్తి పిండిముద్దలను బాహుమూలాల్లో పెట్టి ఆ తరువాత తీసి మూకుడులో వేయించాడు. మరో వ్యక్తి చేయి కడుక్కున్న నీళ్లను పిండిలో పోస్తాడు.

Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!

అయితే, ఇవన్నీ చూసి నవ్విన పరమ్‌వీర్ అవన్నీ అవాస్తమని హుందాగా ఆమెకు సమాధానం ఇచ్చాడు. ‘‘నన్ను నమ్మండి.. ఇలాంటి దృశ్యాలేవీ భారత్‌లో ఉండవు. అసలు ఇలాంటి వీడియోలు వీళ్లకు ఎక్కడ దొరుకుతాయో నాకైతే తెలీట్లేదు. నేనైతే ఇలాంటివెప్పుడూ ఇండియాలో చూడలేదు. మీరు మంచి హోటల్‌కో లేదా రెస్టారెంట్‌కో వెళితే భారతీయ ఫుడ్స్ ఎంత రుచిగా ఉంటాయో అర్థమవుతుంది’’ అని అన్నాడు.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..


చైనా యువతికి ఎలాగైనా భారతీయ వంటకాలు పరిచయం చేయాలనుకున్న అతడు ఆమెను ఓ భారతీయ రెస్టారెంట్‌కు కూడా తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు దాల్ మఖానీ, షాహీ పనీర్, నాన్ రొట్టె రుచి చూపించాడు. వాటిని చూడగానే తొలుత సందేహించిన యువతి ఒక్కసారి రుచి చూడగానే తన అభిప్రాయాన్ని మార్చుకుంది. భలే రుచిగా ఉన్నాయంటూ తినేసింది.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూసేందుకు వెళ్లిన అతడు అక్కడి విశేషాలను పంచుకుంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సీక్రెట్స్’ పేరిట షేర్ చేసిన ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటోళ్ల వల్లే భారత్ ఇమేజ్ పెరిగేది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Latest and Travel News

Updated Date - Oct 27 , 2024 | 07:11 PM