ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: నదిలో చుట్టుముట్టి దాడికి దిగిన మొసళ్లను సింగిల్‌గా ఎదిరించిన జీబ్రా!

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:39 PM

నదిలో చుట్టుముట్టి దాని చేస్తున్న మొసళ్లను సింగిల్‌గా ఎదిరించి తప్పించుకున్న ఓ జీబ్రా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: నీటిలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు..అన్నట్టు మొసలి శక్తి అపారం. నీటిలో ఉంటే దాన్ని ఎందిరించగలిగే జంతువే లేదు. అది కొరికితే చదరపు అంగుళం భాగంలో 5 వేల పౌండ్ల బరువు పెట్టినంత ఒత్తిడి పడుతుంది. ఎముకలు ఎండు పుల్లల్లా విరిగిపోతాయి. సరిగ్గా అలాంటి మొసళ్ల నుంచి తప్పించుకుందో జీబ్రా. నీళ్లల్లో ఉన్న దాన్ని మొసళ్లు చుట్టుముట్టినా ధైర్యంగా ఎదిరించి ప్రాణాలు నిలబెట్టుకుంది. అసాధ్యమనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: భవనంలోంచి దూసుకుపోయిన రైలు! గ్రాఫిక్స్‌ను మించిన సీన్!


అదృష్టానికి తెగింపు కూడా తోడవడంతో ఓ జీబ్రా అద్భుతమే సాధించింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జీబ్రా నదిని దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది నది మధ్యలోకి వచ్చింది. నీరు మెడ వరకూ చేరేంతలా అది నదిలో మునిగింది. సరిగ్గా అలాంటి సమయంలో దాన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. అందులో ఒకటి పెద్దగా నోరు తెరిచి దాన్ని నోట పట్టేందుకు వచ్చింది. అయితే, జీబ్రా మాత్రం తిరగబడి దాన్ని దవడపై కొరికేసింది. అది నోరు మూయలేనంత గట్టిగా కొరికేసింది. జీబ్రా ప్రతిఘటన చూసి మిగతా మొసళ్లు క్షణకాలం వెనకడుగు వేశాయి. ఒక్కసారిగా దాడి చేసేందుకు సిద్ధమై కూడా వెనక్క జంకాయి. ఇదే అవకాశం అనుకున్న జీబ్రా తన ప్రతిదాడిని కొనసాగిస్తూనే వాటన్నిటినీ దాటుకుంటూ నదిలోంచి బయటపడింది (Zebra bites and fights back crocodiles in water and safely makes it to the shore).

వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. జీబ్రా పోరాటం స్ఫూర్తి నీయం అని అనేక మంది అభిప్రాయపడ్డారు. తెగువ ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడొచ్చని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

Updated Date - Jul 11 , 2024 | 03:41 PM

Advertising
Advertising
<