Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:12 PM
భారతీయులకు సంపన్నులంటే అయిష్టత ఉందా? అంటే ఉందనే అంటున్నారు జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్. దేశంలోని సోషలిస్టు భావజాలం, సంపదలో అసమానతల కారణంగా ప్రజల్లో సంపన్నులపై అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయని, అపనమ్మకాన్ని పెంచుతున్నాయని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు సంపన్నులంటే అయిష్టత ఉందా? అంటే ఉందనే అంటున్నారు జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్. దీనికి వెనక చాలా పెద్ద కారణమే ఉందని చెప్పిన ఆయన ఈ తీరులో మార్పు వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే లేదని కూడా తేల్చి చెప్పారు. టాక్ స్పార్క్స్ - 2024 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూస్టోరీ ఫౌండర్ శ్రద్ధ శర్మ మాట్లాడుతూ సంపన్నులపై భారత్, అమెరికా సమాజాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాల గురించి పంచుకున్నారు (Viral).
NRI: ఏంటీ.. అంత సంపాదిస్తున్నా సరిపోట్లేదా! కెనడా ఎన్నారైపై జనాల విసుర్లు!
అమెరికాలో సంపన్నులు, ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అందుకున్న వారిని విజేతలుగా రోల్స్ మోడల్‌గా చూస్తారని శ్రద్ధ అన్నారు. అక్కడ వారు మీడియాలో కూడా తరచూ కనిపిస్తూ సెలబ్రిటీలుగా మారతారని చెప్పారు. కానీ భారత్‌లో సంపన్నుల విషయంలో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఆర్థిక విజయాల వెనక తరచూ అనైతికత, అక్రమాల నీలి నీడలు కనిపించడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు.
Viral: లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి! వీడియో వైరల్!
ఈ అభిప్రాయంతో ఏకీభవించిన నితిన్ కామత్.. భారత్‌లో సోషలిస్టు భావాలు వేళ్లూనుకోవడం కూడా ఇందుకు మరో ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలకు సోషలిస్టు భావజాలం కారణమని అన్నారు. అమెరికా అంటే పెట్టుబడిదారీ సమాజమని, అక్కడ సంపదకు, విజయానికి గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయని అన్నారు. కానీ ఇండియా పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు మొగ్గుచూపుతున్నా ఇంకా సోషలిస్టు మూలాలు ఉన్నాయని అన్నారు (Zerodha CEO Nithin Kamath On Why Indians Hate The Rich).
Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..
ఈ ఆలోచనా రీతిలో ఇప్పుడప్పుడే మార్పు వస్తుందని కూడా తాను భావించట్లేదని నితిన్ కామత్ అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు ఈ స్థాయిలో ఉన్నంతకాలం సంపన్నులపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటాయని అన్నారు. సంపదలో అంతరాల వెనక ఉన్న ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ప్రజల ఆలోచనా ధోరణుల్లో మార్పులను అడ్డుకుంటాయని అన్నారు. ‘‘మౌలికంగా మనందరం సోషలిస్టులమే’’ అని ఆయన కామెంట్ చేశారు
Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!
కాగా, ఈ టాపిక్‌పై నెట్టింట కూడా పెద్ద చర్చ మొదలైంది. జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘‘ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయని కానీ దేశంలో ఆదాయ అంతరాలు మాత్రం మనల్ని ఎప్పటికీ హేళన చేస్తుంటాయి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. పన్నులు ఎగ్గొడుతూ, మోసాలకు పాల్పడుతూ, దిగువ, మధ్యతరగతి వర్గాలను పీల్చి పిప్పి చేస్తూ డబ్బున్నోళ్లు మరింత సంపద కూడబెడుతున్నారని ఓ వ్యక్తి మండి పడ్డాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Updated Date - Sep 29 , 2024 | 04:21 PM