ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఎంతపని చేశాడీ డెలివరీ ఏజెంట్! ఎవరూ చూడట్లేదనుకుని.. వైరల్ వీడియో!

ABN, Publish Date - Jun 29 , 2024 | 07:33 PM

ఆర్డర్ డెలివరీ కోసం వచ్చిన ఓ ఏజెంట్ కస్టమర్ ఇంటి ముందున్న పార్సిల్ తీసుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా జొమాటో సదరు కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక నగర జీవితం మరింత సులువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కొందరు డెలివరీ ఏజెంట్ల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇలాంటి ఘటనలు నిత్యం వైరల్ (Viral) అవుతుండగా తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో డెలివరీ ఏజెంట్ చేసిన పనికి చివరకు జొమాటో క్షమాపణలు చెప్పింది.

Viral: అసలైన జాతి రత్నం అంటే ఈయనే.. భారతీయుడికి సెల్యూట్ కొట్టిన బ్రిటిషర్లు!


ఆదిత్య అనే బెంగళూరు వాసి తనకెదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. తన ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన అతడు ఎం చేశాడో చెబుతూ ఆదిత్య ఓ వీడియో షేర్ చేశారు. ఫుడ్ డెలివరీకి వచ్చిన డెలివరీ ఏజెంట్ కస్టమర్ తలుపు తెరవడం లేటు కావడంతో కాసేపు వేచి చూశాడు. ఈ క్రమంలో అతడి కన్ను అక్కడే ఉన్న మరో ప్యాకేజీ మీద పడింది. అతడి మదిలో దుర్బుద్ధి పుట్టింది. ఎవరూ తనను గమనించట్లేదని డిసైడై తను తెచ్చిన ప్యాకెట్ ను అక్కడ వదిలేసి అక్కడున్న దాన్ని వెంట తీసుకుని వెళ్లిపోయాడు. పిల్లి కళ్లుమూసుకుని తనను ఎవరూ చూడట్లేదని భావించినట్టు మనోడు దర్జాగా చోరీ చేశాడు. కానీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఇదంతా రికార్డైంది (Zomato Delivery Agent Steals Food Packet Bengaluru Company Apologises). .


సదరు కస్టమర్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ జరిగిన దారుణం గురించి మండిపడ్డాడు. డెలివరీ ఏజెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూస్తుండగానే ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లను కూడా షాక్ కు గురి చేసింది. వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో జొమాటో కూడా స్పందించింది. సదరు కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ హేయమైన చర్యకు పాల్పడిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 29 , 2024 | 07:34 PM

Advertising
Advertising