ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gujarat: డెలివరీ ఏజెంట్‌గా మహిళ.. ఒడిలో చిన్నారి.. ఆపై

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:19 PM

ఆర్థిక సమస్యలతో ఆ వివాహిత తల్లడిల్లింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కుమారుడు ఉండటం వల్ల జాబ్ చేసే పరిస్థితి లేదు. దాంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌‌గా మారింది. తనతోపాటు పిల్లాడిని కూడా తీసుకెళుతోంది. వివాహిత జాబ్ చేస్తోండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్అవుతోంది.

Zomato Delivery Agent

రాజ్‌కోట్: పొట్ట కూటి కోసం ఓ మహిళ డెలివరీ ఏజెంట్‌గా మారింది. ఆమె నడిపేది స్కూటీ కాదు.. బైక్. బైక్ మీద ఒక్కరే వెళ్లి డెలివరీ ఇస్తున్నారా అంటే అదీ కాదు. ముందర తన కుమారుడిని కూర్చొబెట్టుకొని మరీ వెళుతోంది. ఆ మహిళ పడుతోన్న కష్టాన్ని చూసి ఓ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వివాహిత బాధ్యత నిర్వర్తించడంతో పాటు తన కర్తవ్యాన్ని మరవలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. బైక్ మీద వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఇదీ విషయం

గుజరాత్ రాజ్ కోట్‌లో ఓ వివాహిత మహిళ బైక్‌పై వెళుతోంది. హీరో హోండా స్ప్లెండర్ బండి నడుపుతోంది. ముందట కుమారుడిని కూర్చొబెట్టుకుంది. ఇలా వెళ్లడం కామనే.. ఆమె డెలివరీ ఏజెంట్‌‌గా పని చేస్తోంది. ఆమెను చూసి ఇన్ స్టగ్రామ్ కంటెంట్ క్రియేటర్ విశాల్ షాకయ్యారు. తర్వాత ఆమెతో మాట్లాడారు. నేపథ్యం ఏంటీ.. జాబ్ చేసేందుకు గల కారణాలను తెలుసుకున్నారు.



పెళ్లైంది.. సమస్యలు

‘అందరీ లాగే నాకు పెళ్లయ్యింది. పెళ్లయిన తర్వాత ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఏం చేయాలా అని ఆలోచించా. అప్పటికే హోటల్ మేనెజ్ మెంట్ కోర్సు పూర్తి చేశా. కుమారుడు ఉండటంతో జాబ్ చేయడం సాధ్యం కాలేదు. నా వద్ద బైక్ ఉంది. కుమారుడిని వెంట తీసుకెళ్లే జాబ్ అయితే ఫర్లేదు అని ఆలోచించా. ఆ సమయంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఉద్యోగం నాకు చక్కగా సరిపోతుందని భావించా అని’ ఆ వివాహిత తన గోడును వెల్లబోసుకుంది.



వైరల్..

ఆ వివాహిత వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. వేలాది మంది లైక్ చేశారు. నెటిజన్ల కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోయింది. ఇంటి బాధ్యతల కోసం వివాహిత చాలా కష్టపడుతోందని ఒకరు, మీరు గ్రేట్ అని మరొకరు, రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని మరొకరు సూచించారు. సెల్యూట్ దీదీ అని మరికొందరు కామెంట్స్ చేశారు. నిజమే.. ఇంటి కోసం ఆ వివాహిత ఏకంగా డెలివరీ ఏజెంట్‌గా మారింది. తన వెంట పిల్లాడిని తీసుకొని వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదలించింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇతడిని చూస్తే భయానికే భయం.. ఇతను ఏ పరిస్థితుల్లో భేల్ పూరీ చేస్తున్నాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్‌తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2024 | 01:19 PM