Share News

Zombie Virus: ప్రపంచానికి మరో ముప్పు.. ప్రాణాలను బలితీసుకోవడానికి రాబోతున్న జాంబీ వైరస్..?

ABN , Publish Date - Jan 23 , 2024 | 10:51 AM

కోవిడ్ సృష్టించిన విలయం తరువాత ప్రపంచం మీదకు జాంబీ వైరస్ దండయాత్రకు వస్తోందన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.

Zombie Virus: ప్రపంచానికి మరో ముప్పు.. ప్రాణాలను బలితీసుకోవడానికి రాబోతున్న  జాంబీ వైరస్..?

హాలీవుడ్ సినిమాలు, మన తెలుగులో జాంబీ రెడ్డి సినిమా చూసినవారికి జాంబీల గురించి అవగాహన ఉండే ఉంటుంది. ప్రమాదకరమైన వైరస్ సోకి మనుషులు ప్రాణం లేనివారిగా మారిపోతారు. తోటి మనుషుల మీద రాక్షసుల్లా దాడి చేయడం, వింత చేష్టలు, వెలుతురుకు భయపడటం వంటి లక్షణాలు కూడా వీరిలో ఉంటాయని సినిమా కథలు చెబుతున్నాయి. కోవిడ్ సృష్టించిన విలయం తరువాత ప్రపంచం మీదకు జాంబీ వైరస్ దండయాత్రకు వస్తోందన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించడంతో మరింత ఉత్కంఠ చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న మంచు సరస్సుల కింద లక్షన్నర సంవత్సరాల క్రితం సమాధి అయిన 13కొత్త రకాల వైరస్లను శాస్ర్తవేత్తలు సేకరించారని 2022లో తెలిసింది. కాగా ఇప్పుడు ఆర్కిటిక్ తదితర ప్రాంతాలలో మంచు కింద స్థంభింపజేసిన వైరస్ తిరిగి ఉనికిలోకి రాబోతోందని పరిశోధకులు చేబుతున్నారు. పెర్మాఫ్రాస్ట్ అనేది భూమి ఉపరితలంపై లేదా దిగువన శాశ్వతంగా ఘనీభవించిన పొర. ఈ పొర మట్టి, కంకర, ఇసుకతో మిళితమై ఉంటుంది. సాధారణంగా మంచుతో కలిసిపోయి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఘనీభవించిన మంచు కరగడం ప్రారంభించిందని, తొందరలోనే ఈ వైరస్లు ఉనికిలోకి రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియక పోయినా ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే వీటిని తప్పక తినాల్సిందే..!

మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 10:59 AM