ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sachin: ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు.. సచిన్ ట్వీట్ వైరల్

ABN, Publish Date - Mar 11 , 2024 | 01:04 PM

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చారిత్రాత్మక వాంఖడే స్టేడియం(Wankhede Stadium) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్(Sachin Tendulkar) చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర ముంబై(mumbai)లోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం(Wankhede Stadium) మార్చి 10న 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రత్యేక వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన ముంబై, విదర్భ కెప్టెన్లు అజింక్యా రహానే, అక్షయ్ వాడ్కర్‌లకు MCA ప్రత్యేక జ్ఞాపికను అందించారు. 1973లో వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడిన మాజీ క్రికెటర్లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సచిన్(Sachin Tendulkar) చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. నేను పదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఈ స్టేడియాన్ని మొదట చుశాను. కానీ ఐదేళ్ల తర్వాత ఇదే స్టేడియంలో నా కేరీర్ ప్రారంభిస్తానని అనుకోలేదు. ఆ తర్వాత 15 ఏళ్ల సమయంలో ఇదే స్టేడియంలో ముంబై తరఫున మొదటిసారి గుజరాత్‪‌పై ఆడాను. తర్వాత క్రమంలో 2011లో ఇదే స్టేడియంలో దేశం తరఫున వరల్డ్ కప్ ఆడి గెలవడం నా జీవితంలో మరిచిపోలేని క్షణాలు. అంతేకాదు ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా వచ్చింది. నెక్ట్స్ ఇదే మైదానంలో నా ఆటకు వీడ్కోలు పలికాను. అందుకే ఇది నాకు ఒక స్టేడియం మాత్రమే కాదు. రెండో ఇల్లు కూడా అవుతుందని సచిన్ తన ట్వీట్‌లో ఎమోషనల్ అవుతూ వెల్లడించారు.


మరోవైపు ఈ స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా BCCI డొమెస్టిక్ తన అధికారిక Xఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో క్రికెటర్ నుంచి వ్యాఖ్యాతగా మారిన విజయ్ దహియా 1974లో నిర్మించిన ఈ వాంఖడే స్టేడియం గురించి ప్రస్తావించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రాకెట్‌ వీరులు మళ్లీ కొట్టారు

Updated Date - Mar 11 , 2024 | 01:04 PM

Advertising
Advertising