ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: కళ్లు చెదిరే క్యాచ్ అంటే ఇదీ.. గాల్లో అద్భుత విన్యానం చేసిన కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ సింగ్!

ABN, Publish Date - Apr 14 , 2024 | 08:48 PM

స్వంత మైదానంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ని కోల్‌కత నైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ సాల్ట్ (89 నాటౌట్) దూకుడుగా ఆడడంతో లఖ్‌నవూ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

రమణ్ దీప్ సింగ్

స్వంత మైదానంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ని కోల్‌కత నైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది (KKR vs LSG). లఖ్‌నవూ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ సాల్ట్ (89 నాటౌట్) దూకుడుగా ఆడడంతో లఖ్‌నవూ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ (Ramandeep Singh Catch) పట్టిన అద్భుతమైన క్యాచ్ చాలా మందిని ఆకట్టుకుంటోంది (IPL 2024).


మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో లఖ్‌నవూ ఆటగాడు దీపక్ హుడ్ ఆఫ్ సైడ్ బలంగా కొట్టిన బంతిని రమణ్ దీప్ సింగ్ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. రమణ్ దీప్ కళ్లు చెదిరే క్యాచ్ చూసి కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్ కూడా చప్పట్లు కొట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఆ క్యాచ్‌పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ సునాయాసంగా మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (89 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (38 నాటౌట్) రాణించారు.

ఇవి కూడా చదవండి..

KKR vs LSG: కోల్‌కతా ఖాతాలో మరో విజయం.. లక్నో చిత్తు


Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్.. ఆ స్టార్ ప్లేయర్ యూ-టర్న్?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 08:48 PM

Advertising
Advertising