ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinesh Phogat: ఇది నిజం కాకపోతే బాగుండు.. వినేశ్ ఫొగాట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా దిగ్భ్రాంతి!

ABN, Publish Date - Aug 07 , 2024 | 03:21 PM

రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

Vinesh Phogat

రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒలింపిక్స్‌లో (Paris Olympics) ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు నిరాశకు లోనయ్యారు. సాధారణ అభిమానులే కాదు.. రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా తమ నిరాశను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.


క్రీడాంశాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ``ఎక్స్`` ద్వారా తన స్పందన తెలియజేశారు. ``నోనోనో.. ఇది పీడకల అయితే బాగుండు. ఇది నిజం కాకపోతే బాగుండు`` అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు వినేశ్‌కు మద్దతుగా నిలిచారు. ఆమె ధైర్యం కోల్పోకూడదని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు మద్దతుగా నిలవాలని అన్ని రాజకీయ పక్షాల నేతలూ వ్యాఖ్యలు చేశారు. కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉందని ఆమెపై అనర్హత వేటు వేయడం దారుణమని ఆప్ ఎంపీ అన్నారు.


ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంతో మరో ఫైనలిస్ట్‌కు స్వర్ణం దక్కనుంది. సిల్వర్ మెడల్‌ను మాత్రం ఎవరికీ ఇవ్వకుండా వదిలేస్తారు. తర్వాతి స్థానాల్లో నిలిచిన వారికి రెండు కాంస్య పతకాలను అందిస్తారు. సెమీస్‌లో ఓడిన రెజ్లర్లు ఇద్దరు రెజ్లర్లకు పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఒక కాంస్యం అందిస్తారు. ఇక, మరో కాంస్యాన్ని రెఫిఛేజ్ రౌండ్ విజేతకు అందిస్తారు.

ఇవి కూడా చదవండి..

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..


ఒకే ఒక్క త్రో...

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2024 | 03:21 PM

Advertising
Advertising
<