Share News

Titans : టైటాన్స్‌కు మళ్లీ నిరాశే

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:02 AM

ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వైఫల్యం కొనసాగుతోంది. సొంతగడ్డపై అభిమానులను కూడా ఆ జట్టు నిరాశపరిచింది. శుక్రవారం ఇక్కడ గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో

Titans :  టైటాన్స్‌కు మళ్లీ నిరాశే

బెంగళూరు చేతిలో ఓటమి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వైఫల్యం కొనసాగుతోంది. సొంతగడ్డపై అభిమానులను కూడా ఆ జట్టు నిరాశపరిచింది. శుక్రవారం ఇక్కడ గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో మొదలైన హైదరాబాద్‌ అంచె పోటీల్లో తెలుగు టైటాన్స్‌ 26-42 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్‌ అంచె పోటీలను ప్రారంభించారు. ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 34-31తో యూపీ యోధా్‌సపై విజయం సాధించింది. ఇప్పటిదాకా తానాడిన మొత్తం 13 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపందుకున్న టైటాన్స్‌ కేవలం పది పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది.

Updated Date - Jan 20 , 2024 | 01:03 AM