Rohit Sharma: కివీస్‌తో ఫైనల్స్.. రోహిత్ ముందు 5 సవాళ్లు.. అంత ఈజీ కాదు గురూ
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:19 PM
Champions Trophy Finals 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఇప్పుడు తుది పోరాటానికి సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే సండే ఫైట్‌లో గనుక గెలిస్తే టీమిండియా ఒడిలో మరో ఐసీసీ ట్రోఫీ ఒదిగిపోతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. సారథి రోహిత్ శర్మ పలు సవాళ్లను దాటాల్సి ఉంటుంది.

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరుకు చేరుకుంది. ఈ ఆదివారం (మార్చి 9వ తేదీ) నాడు జరిగే ఫైనల్స్‌తో టోర్నమెంట్ ముగుస్తుంది. తుదిపోరులో తాడోపేడో తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఒక్క ఓటమి కూడా లేకుండా తుదిమెట్టుకు చేరుకున్న రోహిత్ సేన.. సండే ఫైట్‌లో కివీస్‌ను మరోమారు ఓడించాలని చూస్తోంది. గ్రూప్ దశలో మాదిరిగానే ఇంకోసారి బ్లాక్‌కాప్స్ పని పట్టాలని అనుకుంటోంది. ఇంకో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌కు ముందు రోహిత్ ఎదురుగా ఉన్న 5 సవాళ్లు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
గాయాలు
భారత జట్టులో అంతా బాగానే ఉన్నా గాయాలు టీమ్‌ను కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మధ్యే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమి పూర్తి ఫిట్‌గా లేడు. ఆసీస్‌తో జరిగిన సెమీస్ ఫైట్‌లో చీలమండ గాయం తిరగబెట్టడంతో అతడు కొద్దిసేపు గ్రౌండ్‌ను వీడాడు. ఫైనల్స్‌కు ముందు రెస్ట్ దొరికింది కాబట్టి అతడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించొచ్చు. ఒకవేళ రికవర్ అవ్వకపోతే మాత్రం టీమ్‌కు బిగ్ మైనస్ అనే చెప్పాలి. షమి లాంటి వికెట్ టేకర్ లేకపోతే రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి అతడి రివకరీపై టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ హిట్‌మ్యాన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అతడు కోలుకోకపోతే హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌లో కండీషన్స్‌కు ఎవరు బాగా సూట్ అవుతారో వాళ్లను తీసుకోవచ్చు.
ఫామ్
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నుంచి అందరు ప్లేయర్లు తమ బెస్ట్ ఇస్తున్నారు. కానీ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. దానికి ఫైనల్ వేదికైతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మంచి స్టార్ట్స్ అందిస్తున్నా ఎక్కువ ఓవర్లు ఆడలేకపోతున్నాడు రోహిత్. అతడు కనీసం 15 నుంచి 20 ఓవర్లు ఆడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. కాబట్టి పట్టుదలతో క్రీజులో నిలబడటంపై అతడు దృష్టి పెట్టాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ మెరుగుపర్చుకోవాలని.. లేకపోతే ఫైనల్‌లో మనకే మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒత్తిడి
ఐసీసీ కప్పులు గెలవాలంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు. ఫైనల్‌లో తీవ్ర ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా బెస్ట్ ఇవ్వాలి. అలా చేయలేకే వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్‌లో కంగారూల చేతిలో రోహిత్ సేన భంగపడింది. కాబట్టి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
రికార్డులు
ఐసీసీ టోర్నమెంట్స్‌లో భారత్ మీద కివీస్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ఈ మధ్య మన టీమ్ న్యూజిలాండ్‌ను వదలడం లేదు. ఈ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో బ్లాక్‌క్యాప్స్‌ను ఓడించింది మెన్ ఇన్ బ్లూ. టీ20 వరల్డ్ కప్-2024లోనూ ఆ జట్టుకు భారత్ పంచ్ ఇచ్చింది. అయితే వన్డే వరల్డ్ కప్-2019లో తగిలిన గాయానికి, జరిగిన అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు.
టాస్
దుబాయ్ స్టేడియంలో చేజింగ్ అంత ఈజీ కాదు. కాబట్టి టాస్ కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది. సెమీస్‌లో అదే గ్రౌండ్‌లో భారత్ చేజ్ చేసి గెలిచింది. కానీ అన్నిసార్లు అలాగే జరగాలని భావించలేం. రోహిత్ టాస్ గెలిస్తే టీమిండియా సగం మ్యాచ్ గెలిచేసినట్లేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కానీ హిట్‌మ్యాన్ వరుసగా టాస్‌లు ఓడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గాలని కోరుకోవాల్సిందే. ఒకవేళ టాస్ ఓడినా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి.
ఇవీ చదవండి:
రోహిత్ మాట వింటున్నా పట్టించుకోట్లేదు: రాహుల్
19 ఏళ్ల కెరీర్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి