ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: అనుష్క శర్మకు ముగ్గురు పిల్లలు.. కోహ్లీ వైరల్ డ్యాన్స్‌పై నెటిజన్ల కామెంట్లు!

ABN, Publish Date - Mar 24 , 2024 | 09:11 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసేటపుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, మిగిలిన సమయాల్లో అంత సరదాగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ లైవ్లీ‌గా ఉంటాడు.

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేసేటపుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, మిగిలిన సమయాల్లో అంత సరదాగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ లైవ్లీ‌గా ఉంటాడు. తన మనసుకు నచ్చింది చేస్తుంటాడు. ఏ ఫీలింగ్‌నూ మనసులో దాచుకోడు. ప్రత్యర్థితో గొడవకు దిగేందుకైనా, మైదానంలో చిందులేసేందుకైనా సై అంటాడు. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ప్రవర్తిస్తుంటాడు.

చాలా రోజుల విరామం తర్వాత కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2024) ఆడుతున్నాడు. ఐపీఎల్ తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (CSK vs RCB) కోహ్లీ చాలా ఉల్లాసంగా కనిపించాడు. మైదానంలో విజయ్ ``అప్పడి పోడు`` పాటకు తనదైన శైలిలో స్టెప్‌లు వేశాడు (Kohli Dance). కోహ్లీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై (Viral Video) నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కోహ్లీ స్పిరిట్, యాక్టివ్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు.

``అనుష్క శర్మకు కోహ్లీతో కలిపి ముగ్గురు పిల్లలు``, ``కోహ్లీది చిన్న పిల్లల మనస్తత్వం``, ``కోహ్లీ ఎప్పుడూ లైవ్లీగా ఉంటాడు``, ``కోహ్లీ నిజమైన ఎంటర్‌టైనర్``, ``కోహ్లీకి ఫిల్టర్స్ ఉండవు``, ``తన మనసుకు ఏది నచ్చితే అది చేస్తాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, కోహ్లీ గతంలో కూడా మైదానంలో డ్యాన్స్ స్టెప్‌లు వేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచడానికి కోహ్లీ అప్పుడప్పుడు తనలోని డ్యాన్సర్‌ను బయటకు రప్పిస్తుంటాడు.

Updated Date - Mar 24 , 2024 | 09:11 PM

Advertising
Advertising