ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: ``ఈ మనిషి నా సొంతం అయినందుకు``.. సంతోషంగా ఉంది: అనుష్క

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:05 AM

దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఓ ఐసీసీ టైటిల్ సాధించడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. మైదానంలో ఆటగాళ్లను మించిన ఆనందాన్ని అనుభవించింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

Anushka Sharma congratulates Virat Kohli after T20 World Cup win

దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఓ ఐసీసీ టైటిల్ (T20 Worldcup) సాధించడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. మైదానంలో ఆటగాళ్లను మించిన ఆనందాన్ని అనుభవించింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచిన కోహ్లీని (Virat Kohli) ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


అంతర్జాతీయ టీ20లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి అతడి భార్య అనుష్క శర్మ (Anushka Sharma) ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. జాతీయ జెండా ధరించి ట్రోఫీ పట్టుకున్న కోహ్లీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ``ఈ మనిషిని ఎంతో ప్రేమిస్తున్నా. నువ్వు నా వాడివి అని చెప్పుకుంటున్నందుకు ఎంతో కృతజ్ఞురాలిని. ఈ క్షణాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నా కోసం మెరిసే నీటిని తీసుకుని రా`` అంటూ కామెంట్ చేసింది. అనంతరం టీమిండియా ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్న పలు ఫొటోలను పంచుకుంది.


``విజయం తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా కూతురు ఆందోళన చెందింది. వారిని కౌగిలించుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుణ్ను అనుకుంది. అవును డార్లింగ్.. వారిని 150 కోట్ల మంది కౌగిలించుకుంటున్నారు. ఎంత అద్భుమైన విజయం. అభినందనలు.. ఛాంపియన్స్`` అంటూ అనుష్క కామెంట్ చేసింది.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ఓటమి తప్పదనుకునే దశలో హార్దిక్ ఏం చేశాడో చూడండి.. క్లాసెన్ అవుట్ టర్నింగ్ పాయింట్!


T20 Worldcup: మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ అద్భుత విన్యాసం చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 11:07 AM

Advertising
Advertising