ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపద్బాంధవుడు

ABN, Publish Date - Dec 29 , 2024 | 05:51 AM

ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అతడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోవాల్సిన టెస్టు క్రికెట్‌లోనూ భళా అనిపిస్తున్నాడు. కంగారూల గడ్డపై బౌన్సీ, స్వింగ్‌ పిచ్‌లకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను...

ఐపీఎల్‌లో సంచలన బ్యాటింగ్‌తో భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలోనూ సత్తా చాటి టెస్టు జట్టులో సైతం చోటు ఖాయం చేసుకున్నాడు. తిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినప్పుడు ‘పొట్టి ఫార్మాట్‌లో ఎడాపెడా బంతిని బాదినంత సులువుకాదు సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించడం’ అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆస్ట్రేలియాతో తొలి మూడు టెస్టుల్లోనూ నిలకడైన బ్యాటింగ్‌తో తానేమిటో నిరూపించుకున్నాడు. కీలకమైన నాలుగో టెస్టులో జట్టు అత్యంత దయనీయస్థితిలో ఉన్నప్పుడు ఏకంగా శతకంతో కదంతొక్కి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. క్రికెట్‌ పండితుల నీరాజనాలు అందుకున్నాడు. అతడే తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి.


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అతడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోవాల్సిన టెస్టు క్రికెట్‌లోనూ భళా అనిపిస్తున్నాడు. కంగారూల గడ్డపై బౌన్సీ, స్వింగ్‌ పిచ్‌లకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను మార్చుకొని నికార్సయిన క్రికెటర్‌గా ప్రశంసలు పొందుతున్నా డు. అరంగేట్రం టెస్టులో..పెర్త్‌ బౌన్సీ వికెట్‌పై కోహ్లీ, రాహుల్‌ వంటి హేమాహేమీ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ..తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో నితీశ్‌ ఆకట్టుకున్నాడు. భారత్‌ ఘన విజయం సాధించిన ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక అడిలైడ్‌ డే/నైట్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగుల చొప్పున చేసి తన విలువ చాటిచెప్పాడు. మెల్‌బోర్న్‌ టెస్టు శతక ఇన్నింగ్స్‌తో 21 ఏళ్ల నితీశ్‌ ఒక్కసారి సూపర్‌ స్టార్‌గా మారాడు. సిరీ్‌సలో ఇప్పటివరకు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గానూ న్యాయం చేశాడు.


ఎన్నో కష్టాలకోర్చి..: నితీశ్‌ ఈస్థాయికి రావడం వెనుక అతడి కఠోర శ్రమతోపాటు కుటుంబ త్యాగం చాలా ఉంది. విశాఖపట్నానికి చెందిన నితీశ్‌ తండ్రి ముత్యాలరెడ్డి హిందుస్థాన్‌ జింక్‌ సంస్థ నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకొన్నారు. ఎందుకో తెలుసా..క్రికెటర్‌ కావాలనే తన 12 ఏళ్ల కుమారుడు నితీశ్‌ కల నిజం చేసేందుకు. సరైన క్రికెట్‌ కోచింగ్‌ సౌకర్యాలు లేని ఉదయ్‌పూర్‌కు బదిలీ కావడంతో ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకొని మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా వెనుకంజ వేయక కుమారుడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రమించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడాదికి ఒక ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్‌తోనే నితీశ్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఇక..నితీశ్‌లోని క్రికెట్‌ ప్రతిభను గమనించిన జాతీయ సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అతడిని ఎంతో ప్రోత్సహించారు. కడపలోని ఆంధ్ర క్రికెట్‌ అకాడమీలో మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాటుదేలిన నితీశ్‌ కొద్దికాలంలోనే దేశవాళీ పోటీల్లో భారీ స్కోర్లతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2017-18 సీజన్‌లో అండర్‌-16 ‘బెస్ట్‌ ప్లేయర్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన నితీశ్‌..గత సీజన్‌లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. అలా టీమిండియాలో చోటు దక్కించుకొని ఆస్ట్రేలియాలో అదరగొడుతున్నాడు.

Updated Date - Dec 29 , 2024 | 05:53 AM