ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:32 AM

ఆటలో గెలుపు ఓటమలు సహజం.. ఓడిపోతే మాత్రం జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది తన బిడ్డ రెండో ప్లేస్‌లో నిలిస్తే చాలా కష్టం. డైజెస్ట్ చేసుకోలేరు. నీరజ్ చోప్రా తల్లి అందుకు మినహాయింపు. భారత్ అంటే పాకిస్థాన్ భగ్గున లేస్తోంది. క్రీడల విషయంలో అంతే. క్రికెట్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఒలింపిక్స్‌లో జావొలిన్ త్రో విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అతనిపై నీరజ్ తల్లి సరోజ్ దేవి ఏ మాత్రం కోపం ప్రదర్శించలేదు.

Neeraj Chopra Mother Saroj Devi

ఆటలో గెలుపు ఓటమలు సహజం.. ఓడిపోతే మాత్రం జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది తన బిడ్డ రెండో ప్లేస్‌లో నిలిస్తే చాలా కష్టం. డైజెస్ట్ చేసుకోలేరు. నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి (Neeraj Chopra Mother Saroj Devi) అందుకు మినహాయింపు. భారత్ అంటే పాకిస్థాన్ భగ్గున లేస్తోంది. క్రీడల విషయంలో అంతే. క్రికెట్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఒలింపిక్స్‌లో జావొలిన్ త్రో విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అతనిపై నీరజ్ తల్లి సరోజ్ దేవి ఏ మాత్రం కోపం ప్రదర్శించలేదు. పైగా.. అతను కూడా మన బిడ్డే అని కామెంట్ చేశారు. నదీమ్‌పై సరోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


సరోజ్ ఏమన్నారంటే..?

‘ఒలింపిక్స్ ఆటలో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. సిల్వర్ మెడల్‌తో మేం సంతోషంగా ఉన్నాం. గోల్డ్ మెడల్ దక్కించుకున్న అర్షద్ కూడా మన బిడ్డ లాంటి వాడు. ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆసియాలో ఇరుగు పొరుగు దేశాలు అయిన భారత్, పాకిస్థాన్.. జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాయి. ఇది మనందరికీ గర్వకారణం అని’ సరోజ్ దేవి స్పష్టం చేశారు. గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్‌పై సరోజ్ దేవి కరుణ చూపించారు.


ఫైనల్లో మాత్రం

ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఫైనల్‌కి వచ్చేసరికి మాత్రం తేడా కొట్టింది. ఫైనల్లో ఆరు ప్రయత్నాల్లో ఒక్క దాన్ని మాత్రమే సరిగా వినియోగించుకున్నాడు. రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరాడు. మిగతా ఐదు ఫౌల్స్ వేశాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ రెండో ప్రయత్నంలో 92.97 మీటర్ల అద్భుత ప్రదర్శన ఇచ్చారు. నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ దక్కించుకోగా.. 88.54 మీటర్ల దూరం విసిరిగిన గ్రెనెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ కాంస్యం పతకం గెలుచుకున్నాడు.


వావ్.. వండర్ ఫుల్..

నీరజ్ తల్లి సరోజ్ కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఇది కదా అసలైన వినయం, వాత్సల్యం కదా అని ఒకరు రాయగా, సరోజ్ దేవి ప్రేక్షకుల మనస్సు దోచిందని మరొకరు రాసుకొచ్చారు.

Updated Date - Aug 09 , 2024 | 08:39 AM

Advertising
Advertising
<