ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sachin Tendulkar: విరాట్, అనుష్క జంటకు బేబీ బాయ్.. సచిన్ సహా ప్రముఖులు ఏమన్నారంటే

ABN, Publish Date - Feb 21 , 2024 | 08:03 AM

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు రెండవ బిడ్డ జన్మించారని విరాట్ సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి వెల్లడించారు. ఈ క్రమంలో సచిన్ సహా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది వినూత్నంగా పోస్టులు చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat kohli) చాలా రోజులుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. దీర్ఘకాలంగా కొనసాగిన ఊహాగానాలకు మంగళవారం తెరపడింది. ఫిబ్రవరి 15న తాను, తన భార్య అనుష్క శర్మ(Anushka sharma) తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులయ్యారని విరాట్ చెప్పాడు. కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ లేఖను పోస్ట్ చేసి సమాచారం అందించారు. ఫిబ్రవరి 15న తాము వామికా తమ్ముడు అకాయ్‌(Akaay)ను మా ఇంటికి స్వాగతించామని చాలా ఆనందంతో అందరికీ చెప్పాలనుకుంటున్నానని వెల్లడించారు. నేను మీ ఆశీర్వాదాలను కోరుతున్నానని పోస్టులో పేర్కొన్నారు.


విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన పేరును హిందీలో అకే అని, ఇంగ్లీషులో అకాయ్(Akaay) అని రాశారు. ఇప్పుడు ఈ పేరుకు అర్థం ఏమిటని అనేక మంది వెతకడం మొదలుపెట్టారు. అయితే అకాయ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దానిలో ఒకటి శరీరం లేనిది, అకాయ్ అంటే శాస్త్రీయంగా పౌర్ణమి లేదా పౌర్ణమి రాత్రి చంద్రుడుగా భావిస్తున్నారు. ఈ పదానికి ఇంకా ఏదైనా అర్థాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కోహ్లీ జంటకు కొడుకు జన్మించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. మీ అందమైన కుటుంబానికి అకాయ్ వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ ప్రపంచానికి స్వాగతం లిటిల్ ఛాంప్ అంటూ వెల్లడించారు.


విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు హర్భజన్ సింగ్(harbhajan singh) కూడా నవజాత శిశువు జన్మించిన సందర్భంగా తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు.


మరోవైపు భారత ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం ఝులన్ గోస్వామి(jhulan goswami) కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL : మార్చి 22 నుంచి ఐపీఎల్‌

Updated Date - Feb 21 , 2024 | 08:10 AM

Advertising
Advertising