ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జై షా!

ABN, Publish Date - May 27 , 2024 | 12:23 PM

దాదాపు రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది.

BCCI secretary Jay Shah

దాదాపు రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది (KKR vs SRH). వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్‌లు సజావుగా సాగడంలో మైదానాల సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు కీలక పాత్ర పోషించారు. వారి కష్టం గుర్తించిన బీసీసీఐ (BCCI) వారికి భారీ నజరానా (Big Cash Reward) ప్రకటించింది.


ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన పది రెగ్యులర్ స్టేడియాలకు చెందిన సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) ట్విటర్ ద్వారా ప్రకటించారు. ``క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తీవ్రంగా శ్రమించి అద్భుతమైన పిచ్‌లను అందించిన 10 రెగ్యులర్ మైదాన సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు ఒక్కొక్కరికీ అభినందనపూర్వకంగా రూ.25 లక్షలు, 3 అదనపు మైదానాల సిబ్బంది, క్యూరేటర్లు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు అందించబోతున్నాం`` అంటూ జై షా ట్వీట్ చేశారు.


ఈ ఐపీఎల్‌లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, లఖ్‌నవూ, అహ్మదాబాద్, జైపూర్ ప్రధాన వేదికలుగా ఉన్నాయి. కాగా, గువాహటి, విశాఖపట్నం, ధర్మశాల స్టేడియాలు అదనపు వేదికలుగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిలోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలోనూ, పంజాబ్ కింగ్స్ ధర్మశాలలోనూ కొన్ని మ్యాచ్‌లు ఆడాయి.

ఇవి కూడా చదవండి..

Shah Rukh Khan: గౌతమ్ గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసిన షారూక్ ఖాన్.. కేకేఆర్‌తోనే ఉంచేందుకు స్కెచ్!


Sunil Narine: సునీల్ నరైన్ అరుదైన ఘనత.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2024 | 04:15 PM

Advertising
Advertising