ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BCCI: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా మాజీ ఆటగాడికి బీసీసీఐ ఆఫర్!

ABN, Publish Date - May 17 , 2024 | 08:02 PM

భారత క్రికెట్‌ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌ ఎంపికపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.

BCCI approach to former player gautam gambhir head coach

భారత క్రికెట్‌ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌ ఎంపికపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత ఈ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో BCCI ఇప్పటికే తదుపరి ప్రధాన కోచ్ కోసం అన్వేషణను ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌(gautam gambhir)ను టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు తెలిసింది.


ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ IPL సీజన్ పూర్తయిన తర్వాత అతనితో తదుపరి చర్చలు జరుగుతాయని క్రీడా వర్గాలు అంటున్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి సంబంధించి బీసీసీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను మే 27లోగా సమర్పించాలి. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ పదవిలో తన పదవీకాలాన్ని పొడిగించకూడదని ద్రవిడ్ ఇప్పటికే బీసీసీఐకి తెలిపాడు.


2007 T20 ప్రపంచకప్, 2011 ODI ప్రపంచకప్ విజేత జట్టులో భాగమైన గౌతమ్ గంభీర్, దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా ఏ జట్టుకు కోచ్ పాత్రను పోషించలేదు. కానీ IPLలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ జట్లకు అధిపతిగా పనిచేశాడు. గంభీర్ 2022, 2023 సంవత్సరాలలో ఆడిన IPL సీజన్లలో LSG జట్టుకు మెంటార్ పాత్రను పోషించాడు. ఆ క్రమంలో రెండు సీజన్లలో ఈ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. అతను IPL 17వ సీజన్‌లో KKR కోసం ఈ పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ జట్టు ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో బీసీసీఐ గంభీర్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Zomato: జోమాటో నుంచి కొత్త ఫీచర్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు

Read Latest Sports News and Telugu News

Updated Date - May 17 , 2024 | 08:07 PM

Advertising
Advertising