Share News

Team India: వరుస ఓటములతో టీమిండియా కుదేలు.. గంభీర్ అధికారాలకు చెక్ పెట్టనున్న బీసీసీఐ?

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:52 PM

ఎన్నో అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్‌కు చాలా నిరాశపూరిత ఆరంభం లభించింది. టీ-20 ప్రపంచకప్ గెలిచి మంచి జోరు మీద ఉన్న టీమిండియా గంభీర్ మార్గనిర్దేశకత్వంలో దారుణ పరాజయాలు చవిచూస్తోంది.

Team India: వరుస ఓటములతో టీమిండియా కుదేలు..  గంభీర్ అధికారాలకు చెక్ పెట్టనున్న బీసీసీఐ?
Gautam Gambhir

ఎన్నో అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)కు చాలా నిరాశపూరిత ఆరంభం లభించింది. టీ-20 ప్రపంచకప్ గెలిచి మంచి జోరు మీద ఉన్న టీమిండియా గంభీర్ మార్గనిర్దేశకత్వంలో దారుణ పరాజయాలు చవిచూస్తోంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్ వాష్ అయింది (Ind vs NZ Test Series). డబ్ల్యూటీసీ విజేతగా నిలవడం పక్కన పెడితే, డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) చేరడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి వేళ్లూ గంభీర్‌నే చూపెడుతున్నాయి.


టీమిండియా హెడ్ కోచ్‌ (Head Coach )గా నియమితుడైనప్పుడు గంభీర్‌కు బీసీసీఐ (BCCI) పలు పవర్స్ ఇచ్చింది. అంతకు ముందు కోచ్‌లుగా పని చేసిన రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇవ్వని అధికారాలను గంభీర్‌కు ఇచ్చింది. సపోర్ట్ స్టాఫ్ విషయంలో పూర్తి స్వేచ్ఛ గంభీర్‌కు ఇచ్చింది. అలాగే జట్టు సెలెక్షన్ సమావేశాల్లో కూడా పాల్గొని సూచనలు చేసే అవకాశం కల్పించింది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియ పర్యటనకు సంబంధించి కూడా గంభీర్ సూచనల మేరకే జట్టును ఎంపిక చేశారు. అయితే ఆ పర్యటనలో కూడా టీమిండియా విఫలమైతే గంభీర్ అధికారాలకు కత్తెర వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గంభీర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసికొడుతున్నట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.


న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌ను నైట్ వాచ్‌మెన్‌గా పంపడం, సర్ఫరాజ్ ఖాన్‌ను 8వ నెంబర్‌లో ఆడించడం ప్రతికూల ఫలితాలను అందించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైనట్టు సమాచారం. ``బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు ఎంపికలో కోచ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. అయితే గంభీర్‌కు మాత్రం ఆ రూల్ నుంచి మినహాయింపు లభించింద``ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా పర్యటన కోసం హర్షిత్ రాణా, నితీష్ రెడ్డిని తీసుకోవాలని గంభీర్ బలంగా కోరినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా ఓటములు ఎదురైతే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం భారత్‌కు సాధ్యం కాకపోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 04 , 2024 | 01:46 PM