ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు బీహార్ ఎమ్మెల్యే.. షూటింగ్‌లో స్వర్ణ పతకమే టార్గెట్!

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:59 PM

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ కోసం భారత క్రీడాకారులు సర్వ సన్నద్ధమయ్యారు. మొత్తం 117 మంది భారతీయ క్రీడాకారులు ఈ పోటీ కోసం తరలివెళ్లారు. వారిలో బీహార్‌కు చెందిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒకరు. బీహార్‌లోని జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రేయసి షూటింగ్ క్రీడాకారిణి.

Shreyasi Singh

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ (Paris Olympics 2024) కోసం భారత క్రీడాకారులు సర్వ సన్నద్ధమయ్యారు. మొత్తం 117 మంది భారతీయ క్రీడాకారులు ఈ పోటీ కోసం తరలివెళ్లారు. వారిలో బీహార్‌ (Bihar)కు చెందిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ (Shreyasi Singh) ఒకరు. బీహార్‌లోని జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే (Bihar MLA) అయిన శ్రేయసి షూటింగ్ (Shooting) క్రీడాకారిణి. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ విభాగంలో రజత పతకం అందుకుంది. అలాగే 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో స్వర్ణ పతకాన్ని అందుకుంది. అర్జున అవార్డు గ్రహీత కూడా అయిన శ్రేయసి పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది.


శ్రేయసి ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన శ్రేయసి 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రేయసిది పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. దీంతో ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి రావడంతో ఆమె ఎంతో ఇష్టమైన షూటింగ్‌కు తగినంత సమయం కేటాయించలేకపోతోంది. పైగా ఆమె నియోజకవర్గంలో షాట్‌గన్ రేంజ్ అందుబాటులో లేదు. అయినప్పటికీ శ్రేయసి ప్రాక్టీస్ కోసం ఢిల్లీ వెళ్లి వస్తుంటుంది.


ఒకపక్క ఎమ్మెల్యేగా, మరోవైపు క్రీడాకారిణిగా శ్రేయసి తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది. ప్రాక్టీస్ కోసం ఢిల్లీకి వెళ్లడం, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జుముయ్ రావడం.. ప్రస్తుతం ఆమె రైలు ద్వారా అప్ అండ్ డౌన్ చేస్తోంది. ఇక, పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే కృత నిశ్చయంతో ఉంది. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి..

Shoaib Malik: మేం చాలా మంచి వాళ్లం.. టీమిండియాకు చక్కని ఆతిథ్యం అందిస్తాం: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్


Jasprit Bumrah: ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన బుమ్రా!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2024 | 02:07 PM

Advertising
Advertising
<