Paris Olympics 2024: వారానికే రంగు కోల్పోతున్న ఒలింపిక్ మెడల్స్.. సంచలన విషయం బయటపెట్టిన అథ్లెట్!
ABN, Publish Date - Aug 10 , 2024 | 07:38 PM
పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడల కంటే ఇతర విషయాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. క్రీడాకారుల కోసం రూపొందించిన ఒలింపిక్ గ్రామంలో సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు తమ అసంతృప్తిని వెల్లడించారు. తాజాగా మరో అథ్లెట్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) క్రీడల కంటే ఇతర విషయాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. క్రీడాకారుల కోసం రూపొందించిన ఒలింపిక్ గ్రామంలో (Olympic Village) సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు తమ అసంతృప్తిని వెల్లడించారు. తాజాగా మరో అథ్లెట్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. విజేతలకు ఇస్తున్న మెడల్స్ (Olympic Medals) చాలా నాసిరకంగా ఉన్నాయని, వారం రోజుల్లోనే తన మెడల్ రంగును కోల్పోయిందని వెల్లడించాడు. ఈ ఘటన చాలా మందికి షాక్ కలిగిస్తోంది.
అమెరికా స్కేటరల్ నిజా హ్యూస్టన్ (Nyjah Huston) పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం (Bronze Medal) సాధించాడు. కొత్తగా ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించిన ఆ పతకం, వారం రోజులకే రంగు వెలసిపోయిందని తెలిపాడు. రంగు మారిన పతకం ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``పతకం తీసుకున్నప్పుడు అద్భుతంగా ఉంది. దానిని తీసుకుని మెడలో వేసుకున్నాక చెమట తగలగానే కొంత రంగు పోయింది. ఆ తర్వాత వారానికి రంగు వెలసిపోయి గరుకుగా మారిపోయింది. ముందువైపు చాలా మార్పు వచ్చింది. ఈ పతకాల నాణ్యత చాలా తక్కువ. ఈ పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి సాధించి తెచ్చినట్టుగా ఉంద``ని హ్యూస్టన్ పేర్కొన్నాడు.
హ్యూస్టన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌పై పారిస్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తాము విషయం తెలుసుకున్నామని, మెడల్స్ నాణ్యతపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. డ్యామేజ్ అయిన పతకాల స్థానంలో కొత్తవాటిని ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Paris Olympics 2024: పతక వేటలో రీతిక హూడాకు శుభారంభం.. 76 కేజీల రెజ్లింగ్‌లో సునాయాస విజయం!
Aman Sehrawat: అమన్ కూడా బరువు తగ్గాడా? వేటు నుంచి తప్పించుకునేందుకు 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడా?
Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 10 , 2024 | 07:38 PM