ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్యాట్ కమిన్స్ ఎవరో తెలియదా? ఆస్ట్రేలియాలో క్రికెట్ చచ్చిపోతోంది.. వీడియో వైరల్!

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:02 PM

మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం. జాతీయ జట్టు తరఫున ఆడే క్రికెటర్లు అనుభవించే సెలబ్రిటీ స్టేటస్ వేరు. వాళ్లను దేవుళ్లతో సమానంగా చూసే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనదేశంలోనే కాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి చాలా దేశాలు క్రికెట్ ఆడతాయి.

Pat Cummins

మన దేశంలో క్రికెట్ (Cricket) అనేది ఒక మతం. జాతీయ జట్టు తరఫున ఆడే క్రికెటర్లు అనుభవించే సెలబ్రిటీ స్టేటస్ వేరు. వాళ్లను దేవుళ్లతో సమానంగా చూసే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనదేశంలోనే కాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి చాలా దేశాలు క్రికెట్ ఆడతాయి. అయితే ఆయా దేశాల క్రికెటర్లకు అంత ఫాలోయింగ్ ఉండదు. మన దేశ క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్, ఆదాయంలో సగం కూడా వారికి ఉండదు. క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన ఆస్ట్రేలియా (Australia)లో కూడా క్రికెటర్లకు పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.


భారత్‌లో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins). అద్భుతంగా ఆడి గెలిపించిన బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్. అయితే వారిద్దరూ ఎవరో చాలా మంది ఆస్ట్రేలియన్లకు తెలియకపోవడం గమనార్హం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ``మీకు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ గురించి విన్నారా?`` అని రోడ్డు మీద జనాలను ఓ యాంకర్ అడుగుతున్నాడు. అయితే వారిలో చాలా మంది వారిద్దరూ తమకు తెలియదనే సమాధానం చెప్పారు.


వీడియో చివర్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కూడా కనిపించాడు. తాను విరాట్ కోహ్లీ గురించి విన్నాను తప్ప, ఈ ఇద్దరు క్రికెటర్ల గురించి తెలియదని చెప్పాడు. ``ఐసీసీకి సిగ్గు చేటు, ఆస్ట్రేలియాలో క్రికెట్ చచ్చిపోతోంది`` అంటూ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే 5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Arshad Nadeem: ఒలింపిక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌‌పై కానుకల వర్షం.. అతడి మామ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


Paris Olympics 2024: నీరజ్ చోప్రా తల్లి నాకూ తల్లిలాంటిదే.. పాకిస్తాన్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్ కామెంట్స్!


Paris Olympics 2024: వారానికే రంగు కోల్పోతున్న ఒలింపిక్ మెడల్స్.. సంచలన విషయం బయటపెట్టిన అథ్లెట్!


Paris Olympics 2024: నేటితో ఒలింపిక్స్ వేడుకలు ముగింపు.. నెక్స్ట్ ఎక్కడంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2024 | 02:02 PM

Advertising
Advertising
<