ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: హార్దిక్ vs దూబే.. వరల్డ్‌కప్‌లో ఎవరు ఆడాలి?.. మాజీ క్రికెటర్ చెప్పిన సమాధానమిదే!..

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:27 PM

జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికే సెలెక్టర్లు ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు కూడా ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికే సెలెక్టర్లు ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు కూడా ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇటీవల అప్ఘానిస్థాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించాలని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా వరుసగా గాయాల పాలవుతున్న సీనియర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు దూబేను ఎంపిక చేయడం చాలా ఉత్తమం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ విషయంపై మాట్లాడారు.


ఈ సందర్భంగా యువ ఆల్ రౌండర్ శివమ్ దూబేపై చోప్రా ప్రశంసలు కురిపించాడు. శివమ్ దూబే ఆట తీరును చూస్తే తనకు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని చెప్పాడు. బౌలర్లను దూబే ఎదుర్కొనే తీరు అచ్చం యూవీలాగే ఉందని చెప్పుకొచ్చాడు. 30 ఏళ్ల దూబే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. అప్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో శివమ్ దూబేను ముందుగానే క్రీజులోకి పంపించారు. దూబే కంటే ముందు సంజూ శాంసన్ లేదా రింకూ సింగ్‌ను పంపి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే ఇన్నింగ్స్‌ను నిర్మించలేడు. కానీ ఎదురుదాడికి దిగుతాడు. అతను నాకు యువరాజ్ సింగ్‌ను గుర్తు చేశాడు. కాబట్టి అతనిని డౌన్ ది ఆర్డర్‌లో పంపించడం మంచిది’’ అని చోప్రా చెప్పాడు. ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ ఉండాలని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో దూబే సిక్సర్లు కొట్టిన విధానం బాగుందని చెప్పాడు. కొందరు హార్దిక్ స్థానంలో దూబేను తీసుకోవాలని చెబుతున్నారని, కానీ తాను మాత్రం ఇద్దరిని కొనసాగించాలని చెబుతున్నానని తెలిపాడు. కాగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో దూబే చెలరేగాడు. రెండు హాఫ్ సెంచరీలతో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 12:27 PM

Advertising
Advertising